ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఏడాది దాటుతున్న ఈ సినిమా యొక్క హల్చల్ ఇంకా పూర్తి కానీ లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పుష్ప రాజ్ పాత్ర లో అల్లు అర్జున్ తన నటనతో బీభత్సం సృష్టించారు.

అందరు కూడా ఎంతో బాగా నటించారు. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్ తో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన పుష్ప మూవీ ఇప్పుడు దేశాలు దాటి సంచలనాలు సృష్టించబోతుంది. లేటెస్ట్ గా పుష్ప మూవీ రష్యన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అవుతుంది.

ఈ సందర్భంగా పుష్ప టీం అంతా రష్యా చెక్కేసింది. అక్కడ పలు మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అక్కడ ఈ సినిమా ఏ స్థాయి లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *