Samantha-Naga Chaitanya To Nagarjuna-Lakshmi; Is The Akkineni Family Jinxed  In Relationships, Fans Wonder - Filmibeatనాగార్జున మేనకోడలు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సుప్రియా చరణ్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి సినిమా “అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి” హీరోయిన్ అంటే అందరికీ మరింత గుర్తుకొస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురే ఈ సుప్రియ. యంగ్ హీరో సుమంత్ కి స్వయానా అక్క.. అంటే నాగార్జునకి మేనకోడలు.. తండ్రి యార్లగడ్డ సురేంద్ర.. ఒకప్పుడు బడా నిర్మాత కూడా.. అయితే సుప్రియ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించడం… ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు సంరక్షణలోనే తన జీవితాన్ని కొనసాగించింది.

మొదటిసారి “అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి” సినిమాతో హీరోయిన్గా ఎలివేట్ చేయాలని అనుకున్నారు. కానీ ఒక్క సినిమాతోనే ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని తేలిపోయింది. దాంతో హీరోయిన్గా నటించిన కొంతకాలానికి చరణ్ అనే హీరోని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. శ్రీయ మొదటి సినిమా ఇష్టంతో ఈయన కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సుశాంత్ డెబ్యూ మూవీ కాళిదాసుకి కూడా ఇతడే దర్శకుడు కావడం గమనార్హం.

అయితే భర్త దర్శకుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉండగా… సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేది. ప్రస్తుతం ఆమె ఆ స్టూడియోకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాత్రమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోకి ఒక పిల్లర్ లాగా వ్యవహరిస్తోంది. తన వ్యాపార దక్షతతో స్టూడియోకి ఒక కార్పొరేట్ లుక్ ను కూడా తీసుకొచ్చింది… కానీ స్టూడియోలో కొందరిపై చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడేస్తుంటుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాదు తన ఉద్యోగంలో భాగంగానే చాలా కఠినంగా వ్యవహరిస్తుందని కూడా ఆమెను దగ్గరగా చూసినవారు చెబుతూ ఉంటారు.

అయితే సుప్రియను దగ్గర్నుంచి చూసిన చాలామంది ఆమె మాటలు భరించలేక.. తమ తమ చిత్ర షూటింగ్లను రామోజీ ఫిలిం సిటీకి మార్చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంత నిజాయితీగా తన బాధ్యతను నిర్వహించే ఈమె భర్తను కోల్పోవడం, తల్లిదండ్రులను కోల్పోవడం అన్ని జరిగిపోయాయి. అయినా కూడా.. అన్నపూర్ణ బిజినెస్ వ్యవహారాలని సమర్ధవంతంగా నిర్వహిస్తూ సంస్థకు మెయిన్ పిల్లర్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఒకపక్క తల్లిదండ్రులను కోల్పోయి.. భర్తను పోగొట్టుకొని.. కఠినంగా ఉంటుందంటూ ఎంతోమంది ఎన్నో విమర్శల దాడులు చేసినా తట్టుకొని ధైర్యంగా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం జీతానికే పని చేస్తూ సమర్థవంతంగా తన పనిని నిర్వర్తిస్తోంది.. అంతేకాదు ఆ సంస్థని చాలా టాప్ లెవల్లో నిలబెట్టి టాలీవుడ్ లో చాలామందికి ఆదర్శంగా నిలిచింది సుప్రియ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *