Rajasulochana, a versatile actress of Telugu cinemaసినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి వివాదాలు కలుగుతాయో చెప్పడం చాలా కష్టం. ఈ క్రమంలోనే ఆ కాలంలో టాప్ హీరోయిన్గా కొనసాగిన రాజసులోచన 100 చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సి ఎస్ రావుల వివాహం ఒక సెన్సేషన్.. రాజసులోచన అప్పట్లో వ్యాంప్ పాత్రలలో నటించేది. ఆ తర్వాత నెమ్మదిగా హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది . ఆ సమయంలోనే రాజసులోచన అప్పట్లో ఒక వ్యక్తి వెంట పడి పెద్దలను ఎదిరించి మరి ఆయనను వివాహం చేసుకుంది. అయితే ఆ వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఒక పిల్లాడికి జన్మనిచ్చి తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వారిద్దరూ విడిపోయారు.

అదే సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెకు ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య కొడుకు దర్శకుడు సి.ఎస్.రావుతో పరిచయం ఏర్పడింది. అయితే సి ఎస్ రావుకు అప్పటికే వివాహం జరిగింది. ప్రముఖ నటి కన్నాంబ గారి అల్లుడు. ఎంతమంది పెద్దలు చెప్పినా కూడా లెక్కచేయకుండా సెన్సేషనల్ డైరెక్టర్ సి ఎస్ రావు వెంటపడి మరి ప్రేమించింది రాజ సులోచన. ఆ తరువాత రాజ సులోచన ప్రేమలో సిఎస్ రావు కూడా మునిగితేలాడు. ఆ తర్వాత రాజసులోచన దశ తిరగడం.. దర్శకుడు సిఎస్ రావు చేసే ప్రతి సినిమాలో కూడా ఆవిడే హీరోయిన్గా నటించడం అన్నీ జరిగిపోయాయి.

అదే సమయంలో రాజసులోచన టాప్ సౌత్ ఇండియన్ హీరోగా కూడా పేరుపొందింది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే భార్య ఉండి కూడా రాజసులోచనపై మోహం తో ఆమెను వివాహం చేసుకున్నారు సి ఎస్ రావు. అయితే సినిమాల కోసమే సి.ఎస్.రావును వివాహం చేసుకుంది అంటూ అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. మరో పెద్ద హీరోయిన్ అయినా కన్నాంబ తన కూతురి జీవితం నాశనం అవుతుందని గ్రహించి అదే సమయంలో రాజసులోచనను తన ఇంటికి పిలిపించింది. స్టార్ హీరోయిన్ తనను ఇంటికి పిలిపించుకొని మందలిస్తారు అని అనుకున్న రాజేష్ సులోచన భయపడుతూనే వెళ్ళింది. తన కూతురు మీద అల్లుడికి ప్రేమ లేదని , అయితే నా కూతురు జీవితం నాశనమైనట్లుగా మీ జీవితం నాశనం చేసుకోవద్దని.. మీరైనా సరిగ్గా బతకమని చెప్పి పంపించిందట.

అలా మొదటి భార్య తల్లి కన్నాంబ గారి పర్మిషన్తో 1963 లో వివాహం చేసుకున్న వీరికి ఒక అబ్బాయి , అమ్మాయి జన్మించారు .అయితే పిల్లలు పెరుగుతున్న సమయంలో సిఎస్ రావుకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆయన చేసిన పనికి మొదటి భార్య కుటుంబం వారు కూడా దగ్గరకు రానివ్వలేదు. అయితే పెళ్లికి ముందు చిన్న చిన్న తప్పులుగా ఉన్న సిఎస్ రావు అలవాట్లు తర్వాత పెద్దగా కనిపించేసరికి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్నారు. అయితే ఆర్థికంగా చితికిన పడ్డ సిఎస్ రావును రాజ సులోచన ఇంటి నుంచి బయటకు తరిమేసింది . దాంతో ఆమె మీద మోహంతో కట్టుకున్న భార్యను మోసం చేసినందుకుగాను రోడ్ల పైన పిచ్చి పట్టి తిరిగి చివరికి 2004లో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *