Bigg Boss Singer Revanth And Anvitha Blessed With Baby Girl | తండ్రైన  సింగర్ రేవంత్‌.. పండంటి పాపకు జన్మనిచ్చిన అన్విత News in Teluguసింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 21 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా అడుగుపెట్టిన ఈయన తనదైన సత్తా తో టైటిల్ ఫేవరెట్ గా ఆట ఆడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా రేవంత్ తండ్రి అయ్యాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్బాస్ ఇంట్లోకి రేవంత్ వచ్చే ముందే తన భార్య అన్విత గురించి చెప్పాడు. ఆమె గర్భవతి అని.. ఆమెను వదిలి రావడం ఇష్టం లేదని కూడా తెలిపాడు రేవంత్. కానీ తన భార్య తనకు ధైర్యం చెప్పి పంపించిందంటూ ఆమె గురించి చెప్పి మరింత ఎమోషనల్ అయ్యాడు.

అయితే తన భార్యను స్టేజ్ పైనే చూపించి రేవంత్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున. పుట్టబోయే బిడ్డను గర్భంలోంచి ముద్దాడిన రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. బిడ్డ పుట్టాకే తాను బయటకు వస్తాను అన్నట్టుగా రేవంత్ చెప్పాడు . ఎట్టకేలకు తాజాగా అన్విత పండంటి పాపకు జన్మనిచ్చినట్లు.. అన్విత ఈ మేరకు ఒక పోస్ట్ చేసింది. పండంటి ఆడబిడ్డ పుట్టిందని .. ఒకటో తేదీనే పాప పుట్టిందని చెప్పుకొచ్చింది అన్విత. దీంతో రేవంత్ అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాదు కంగ్రాట్స్ రేవంత్ , అన్విత అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ విషయం తెలిసి రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అయినంతగా సంబరపడిపోతున్నారు అభిమానులు.. అయితే బిగ్ బాస్ ఆరవ సీజన్ విన్నర్ అవ్వడానికి రేవంత్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ అవకాశాలను తగ్గించే ఛాన్స్ మాత్రం ఆడియన్స్ కు రేవంత్ ఇస్తుంటాడు. తన కోపంలో మాట్లాడే మాటలు.. తనకే చేటు చేస్తున్నాయి అని తెలుసుకోలేకపోతున్నాడు. కోపంలో ఏం మాట్లాడుతున్నాడు? ఎలా ఉన్నాడు? అనే విషయాలు కూడా ఆయన తెలుసుకోలేకపోతూ ఉండడం గమనార్హం.

మొత్తానికైతే రేవంత్ ఎలా వున్నా ఉన్నా సరే బిగ్ బాస్ విన్నర్ అవడం పక్క అంటూ ఇప్పటికీ రేవంతుకే బిగ్ బాస్ టైటిల్ కొట్టే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనకు బిడ్డ పుట్టిందన్న విషయాన్ని రేవంత్ కు బిగ్ బాస్ చెబుతాడా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *