నటుడు సత్య ప్రకాష్ (SATHYA PRAKASH)అంటే తెలియకపోవచ్చు.కానీ ఆయన మొహం చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈయన అప్పట్లో విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా ఉండేవారు. ఏదైనా సినిమాలో విలన్ కావాలంటే ముందుగా ఈయననే తీసుకునేవారు. తనకున్న డైలాగ్ డెలివరీతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన డైలాగులకు అప్పట్లో చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయనకు విలన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య ప్రకాష్ ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.. నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. నేను అప్పట్లో ఎక్కువగా రేప్ సీన్స్ లో నటించేవాడిని. కానీ నాకు ఆ సన్నివేశాలలో నటించడం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఆ సీన్ లో నటించను అని చెప్పే స్థోమత అప్పట్లో నాకు లేదు. అందుకే అలాంటి పాత్రల్లో నచ్చక పోయిన నటించాల్సి వచ్చింది. అలాగే అప్పట్లో వచ్చే సినిమాలు అన్నింట్లో ఎక్కువగా అటువంటి సన్నివేశాలు ఉండేవి.కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో అవి కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి జనాలు అవి చూడడం లేదు.

అయితే నేను పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్య(SOUNDARYA) తో కలిసి ఓ సన్నివేశంలో నటించాను. అయితే ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ గుర్తుంది. అందులో సౌందర్యను రేప్ చేసే సీన్ ఒకటి ఉంది. ఇక ఆ సీన్ ఇప్పటికి కూడా ప్రేక్షకులు బాగా గుర్తు పెట్టుకుంటారు. అలాగే నేను ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో రమ్యకృష్ణతో కలిసి కూడా ఇలాంటి ఒక రేప్ సీన్ లో నటించాను.అయితే ఆ సన్నివేశంలో నటించడానికి నేను చాలా టేక్స్ తీసుకున్నాను. దీంతో నా నటన చూసి విసిగిపోయిన ముత్యాల సుబ్బయ్య నన్ను చాలా తిట్టారు. ఇక అప్పుడు రమ్యకృష్ణ గారు కల్పించుకొని సార్ మీరు ఓకే చెప్తే నేనే సత్య ప్రకాష్ ని రేప్ చేసేస్తా అంటూ చెప్పడంతో అక్కడున్న వారందరూ నవ్వారు.

రమ్యకృష్ణ గారు చాలా డేర్ అండ్ డాషింగ్ మనిషి. అది సినిమా కాబట్టి నన్ను నువ్వు ఎలాంటి పాత్రలోనైనా చేయాలి అంటూ ఎంకరేజ్ చేశారు. అయితే రమ్య కృష్ణ(RAMYAKRISHNA) అప్పటికే స్టార్ హీరోయిన్. కానీ నన్ను నువ్వు పెద్ద నటుడు అవుతావు అంటూ చెప్పింది. కానీ నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి రావడం వల్ల చాలా టెన్షన్ ఉండేది. అయినప్పటికీ రమ్యకృష్ణ నాతో చాలా సన్నిహితంగా మాట్లాడేసరికి రమ్య కృష్ణతో కలిసి ఆ రేప్ సన్నివేశంలో నేను నటించాను అంటూ సత్య ప్రకాష్ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సత్య ప్రకాష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *