Singer sunitha: నల్ల చీరలో సింగర్ సునీత అందాలు చూడతరమా.. ఎంత అందమో?– News18  Telugu - Page-9టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్టుగా.. వ్యాఖ్యాతగా.. పలు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి మరింత గుర్తింపు సొంతం చేసుకున్న సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గులాబీ సినిమా ద్వారా తన కెరియర్ ను సింగర్ గా మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి సుమారుగా 700 చిత్రాలకు పైగా డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. 3 వేలకు పైగా పాటలు పాడి మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె మొదటి వివాహ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని.. అవమానాలు పడి చివరికి జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చింది.

సమస్యలకు, వివాదాలకు చోటు ఇవ్వకుండా సంతోషంగా ఉండాలని ఆలోచించే సునీత దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన స్నేహితుడైన మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. రెండవ వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన సునీత తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తన అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ తాను గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా వెల్లడిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే సింగర్ గా మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనకు డైరెక్టర్లు పిలిచి మరీ హీరోయిన్గా అవకాశం ఇస్తే వారి ముఖం మీద డోర్ వేసినట్టుగా.. నటించను అని చెప్పిందట సునీత. అసలు విషయంలోకెళితే గులాబీ సినిమాలో “ఈ వేళలో నీవు” పాట సక్సెస్ అయిన తర్వాత రాంగోపాల్ వర్మ తన స్కూల్ సినిమా కోసం సునితను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె నిరాకరించడంతో ఆ పాత్రను శ్రీదేవి చేసిన విషయం తెలిసిందే . ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఈమెకు హీరోయిన్ అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఆమె అవకాశాన్ని అంగీకరించలేకపోయింది.

అయితే అసలు విషయం ఏమిటి అంటే..తాను హీరోయిన్ గా లేదా నటిగా ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం తరచూ ఇండస్ట్రీలో హీరోయిన్లు అలాగే నటీమణులు పడే కష్టాలు దగ్గర్నుంచి చూస్తున్నాను.. మళ్ళీ అలాంటి కష్టాలు నేను పడాలనుకోవట్లేదు.. మనశ్శాంతిగా , సంతోషంగా, ఎటువంటి గొడవలు లేకుండా నా జీవితం సాగాలని కోరుకుంటున్నాను.. అందుకే ఇండస్ట్రీలో ఎంత మంచి అవకాశం వచ్చినా నటించను ” అంటూ తేల్చి చెప్పింది సునీత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *