Ravi Teja News in Hindi, Ravi Teja Latest News, Ravi Teja News

ఇటీవల కాలంలో చాలామంది హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం బుల్లితెర బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలకు చిత్ర బృందం ప్రత్యేకంగా హాజరయ్యి.. తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రవితేజ ధమాకా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈనెల 23వ తేదీన విడుదల కాబోతుండడంతో ప్రమోషన్ల జోరు పెంచాడు మాస్ మహారాజా.

సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే రవితేజ ప్రమోషన్స్ లో మినహా ఎప్పుడు కూడా బయట కనిపించరు. ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఎక్కువగా ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇచ్చే ఈయన ఈసారి మాత్రం తన పాలసీని పక్కనపెట్టి బుల్లితెర డాన్సింగ్ షో ఢీ ఫైనల్స్ కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రమోషన్స్ లో భాగంగా ఢీ షోలో సందడి చేశారు రవితేజ. ఈ క్రమంలోనే తనదైన పంచు డైలాగ్ లతో హైపర్ ఆదికి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు.

అసలు విషయంలోకి వెళితే.. ఢీ సీజన్ 14 ఫినాలే కి గెస్ట్ గా వచ్చిన రవితేజ ఈ షోలో ఉన్న హైపర్ ఆదితో కాస్త సరదాగా మాటల తూటాలు పేల్చాడు. హైపర్ ఆది పై నాన్ స్టాప్ గా సెటైర్లు పేల్చడం చూసి అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. ఆది మాట్లాడుతూ..” మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్న నాకు మీ సినిమాలో అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను.. ఇది నా అదృష్టం” అంటూ హైపర్ ఆది అంటుండగానే నేను కూడా ఎప్పటినుండో నీతో చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు అంతేకాదు అసలు నీకు.. ఈ ఢీ షో కి సంబంధం ఏంటి? అంటూ ముఖం మీద అడిగేసాడు రవితేజ.

దీంతో ముఖం పక్కకు తిప్పుకున్నారు ఆది. అయితే వెంటనే ఎవరిని వదిలిపెట్టడు అందరినీ ఆడేసుకుంటాడు కదా అంటూ చెప్పగానే ప్రదీప్ వత్తాసు పలికారు. ఇవాళ నీకు ఉంది .. నువ్వు అయిపోయావ్ అంటూ రవితేజ గట్టిగా మాస్ వార్నింగ్ ఇస్తూ సరదాగా పంచులు వేశారు. హైపర్ ఆది సంగతి మనందరికీ తెలిసిందే . షోకి కొత్తగా ఎవరైనా వచ్చారు అంటే వారిపై సెటైర్లు వేస్తూ స్కిట్స్ చేస్తాడు. అయితే మాస్ మహారాజా దగ్గర ఆ పప్పులు ఉడకలేదు. ఆది మొదలుపెట్టకు ముందే రవితేజ మొదలుపెట్టి ముగించేశాడు అంటున్నారు నెటిజెన్లు. మొత్తానికి అయితే ఈ ఫైనల్స్ చాలా రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *