టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్(prabhas). ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి పీటలు ఎక్కకపోవడంతో చాలామంది ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ ఉండడంవల్ల ఆయన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఈయన ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్ని పాన్ ఇండియా ప్రాజెక్టు లే. వీటన్నింటిలో ఒక సినిమా హిట్ అయినా చాలు ప్రభాస్ పేరు ప్రపంచం మొత్తం మారుమ్రోగడానికి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే..ఈ మధ్యనే ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (krithisanan)తో ప్రేమలో పడ్డాడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం కృతి సనన్ పదేపదే ప్రభాస్ పేరును వాడడం.

అలాగే ఓ ఇంటర్వ్యూలో మీరు పెళ్లి ఎవరిని చేసుకుంటారు అని అంటే అవకాశం వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని అనడంతో వారిపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ అలాగే ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు కూడా కృతి సనన్ ప్రభాస్ లు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ క్లారిటీ ఇవ్వడం అందరిలో మరింత అనుమానాలు కలిగించాయి. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు కే (project k)సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు.

కానీ ఈయనపై ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయడంతో ప్రభాస్ కోపాన్ని ఆపకోలేక బాలీవుడ్ స్టార్ హీరో అయిన వరుణ్ ధావన్(varun dhavan) పై తన కోపాన్ని ప్రదర్శించాడు అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు కోపంలో ప్రభాస్ చాలా సరదాగా మాట్లాడుతూనే ఎఫ్* అనే అతి పెద్ద బూతు పదాన్ని కూడా వాడి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు మా అభిమాన హీరో పై అలాంటి దుష్ప్రచారాలు చేస్తే ఇలానే ఉంటుంది మరీ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *