All Is Well Between Pawan Kalyan And Ali - Political Newsటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోగా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ఇటీవల పలు షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తన కూతురు డాక్టర్ కోర్స్ పూర్తి చేయడంతో మరొక డాక్టర్ ను వెతికి మరీ వివాహం జరిపించాడు. ఈ వివాహ ఆహ్వాన వేడుకలకు గాను తన భార్య జుబేదాతో కలిసి స్టార్ హీరోలను అలాగే ప్రముఖ రాజకీయ నాయకులను స్వయంగా కలిసి పెళ్లి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఫాతిమా వివాహం సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకపోవడంతో అనుమానాలు మరింత ప్రచురితం అయ్యాయి.

పవన్ కళ్యాణ్ , కమెడియన్ ఆలీ ఇద్దరు మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువగా గుడుంబా శంకర్ మొదలుకొని ఇటీవల వచ్చిన చాలా సినిమాల వరకు అన్ని పవన్ కళ్యాణ్ సినిమాలలో ఆలీకి అవకాశం కల్పిస్తూ వచ్చారు.. కానీ ఇప్పుడేమో రాజకీయపరంగా.. ఆలీ వైసీపీ పార్టీలో చేరడంతో పవన్ కళ్యాణ్ కు మింగుడు పడలేదని.. ఇక్కడే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకే ఆలీ కూతురు వివాహానికి పవన్ కళ్యాణ్ రాలేదు అన్న అనుమానాలు వార్తల రూపంలో ప్రచురితమయ్యాయి. అయితే ఈ ఊహగానాలకు పులిస్టాప్ పెట్టారు కమెడియన్ ఆలీ.

ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పెళ్లికి ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చారు..తన కూతురు పెళ్లి బాగా జరిగిందని.. వచ్చిన వాళ్లకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. ఆ తర్వాత రిసెప్షన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రముఖులందరూ వచ్చారు.. నా కుమార్తె బర్తడే కు చిరంజీవి అప్పట్లో వచ్చారు. మళ్ళీ పెళ్లికి కూడా రావడం చాలా ఆనందం కలిగించింది. నేను పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను .అందుకే ఏపీ ప్రభుత్వ సలహాదారు బాధ్యతలను డిసెంబర్ 10 నుంచి పూర్తిస్థాయిలో స్వీకరిస్తాను అని తెలిపారు.

అలాగే ” పవన్ కళ్యాణ్ కి కూడా నా కుమార్తె వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించాను. కానీ ఆయన ఫ్లైట్ మిస్ అయింది. లేకపోతే ఖచ్చితంగా వచ్చేవాళ్లు.. పవన్ వివాహానికి రావాలనుకున్నారు.. కానీ వాళ్ల సెక్యూరిటీ కూడా వచ్చి.. ఎలా రావాలన్నది ముందే చూసుకున్నారు.. కానీ కుదరలేదు.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి రాలేకపోయాను.. ఏమనుకోవద్దు ..అమ్మాయి , అబ్బాయి ఉన్నప్పుడు ఫోన్ చేయండి.. మీ ఇంటికి వస్తాను” అని చెప్పారు అంటూ అసలు విషయాన్నీ రివీల్ చేశారు ఆలీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *