ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఇప్పుడు సన్యాసులు.. ఎవరంటే..? - PakkaFilmy  Telugu

జీవితమంటే కష్టాలు , సుఖాలు , సంతోషాలు, కన్నీళ్లు, ఎత్తు పల్లాలు అన్ని అందులో ఉంటాయి. అన్నింటిని మనిషి అనుభవించాలి. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు.. చివరికి జీవిత అంకం ముగుస్తుంది.. అయితే సాధారణంగా చాలామంది జీవిత చరమాంకంలో వైరాగ్యం తో ఆధ్యాత్మిక బాట పట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లో కూడా కొంతమంది ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగి.. ఇప్పుడు జీవితం ఇంకా చాలా మిగిలి ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక బాట పట్టి సన్యాసులుగా మారారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

మనీషా కొయిరాలా:
ఒకప్పుడు తెలుగులోనే కాదు అనేక భాషలలో నటిగా గుర్తింపు తెచ్చుకుంది . అయితే ఈమెకు అండాశయ క్యాన్సర్ వచ్చిన తర్వాత సినీ రంగానికి దూరమైంది. అయితే చికిత్స తీసుకొని కోలుకున్నాక ఆధ్యాత్మిక బాట పట్టిన మనిషా కొయిరాల 2016లో ఉజ్జయినిలో సాద్విగా మారింది.

సోఫియా హయత్:
హిందీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన సోఫియా హయత్.. ఒక బ్రిటిష్ మోడల్.. సింగర్, యాక్టర్ గా కూడా రాణించింది. అయితే గతంలో సన్యాసిగా మారి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఆ జీవితానికి స్వస్తి చెబుతూ పెళ్లి చేసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

సుచిత్ర సేన్:
25 ఏళ్ల పాటు నటిగా రాణించిన ఈమె ఇంట్లో నెలకొన్న అశాంతి కారణంగా తన దృష్టిని ఆధ్యాత్మికతవైపు మళ్ళించింది . రామకృష్ణ మఠంలో చేరిన ఈమె సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడస్తూ వచ్చిన ఈమె చివరిగా 2014 జనవరి 17న స్వర్గస్తురాలు అయ్యింది.

బర్కా మదన్:
ఈమె కూడా వరుసగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బౌద్ధ గురవు దలైలామా ప్రవచనాల పట్ల ఆకర్షిత్రాలైన ఈమె 2012లో బుద్ధిజం తీసుకుంది. సన్యాసిగా మారింది. అప్పటి నుంచి బర్కా మదన్ సన్యాసి జీవితాన్ని గడుపుతూ వస్తోంది.

మమతా కులకర్ణి:
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత సన్నాసిగా మారింది. ఈ క్రమంలోనే ఒక ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని కూడా రాసింది. Autobiography of an yogini.. పేరిట ఒక బుక్ ను కూడా విడుదల చేసింది. అయితే ఈమె , ఈమె భర్త ఇద్దరు కూడా రూ.2వేల కోట్ల డ్రగ్ స్కామ్ లో ఇరుక్కున్నారు. అయితే 2017 జూన్ లో థానే కోర్టు వీరిద్దరిని దోషులుగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *