సినిమా పరిశ్రమలో హీరోయిన్లు అందంగా కనబడడానికి రకరకాల శస్త్ర చికిత్సలు చేయించుకుంటారన్న విషయం తెలిసిందే. లావు తగ్గడానికి ఆకర్షణీయంగా కనబడడానికి అందంగా కనబడటానికి వారు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఈ చికిత్సలు చేసుకుంటారు. కొన్నిసార్లు ఈ చికిత్సలు తిరగబడి వారి ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా అందంగా కనపడడం కోసం ఒక భారీ భయంకరమైన ప్రయత్నం చేస్తుంది ఓ హీరోయిన్.

టాలీవుడ్ కథానాయక గా మెహరీన్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంచి గుర్తింపు సంపాదించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలేవీ కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించకపోవడంతో ఇప్పుడు ఆమె తప్పకుండా విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక మంచి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తుంది. ఇప్పటికే యూత్ లో ఫేమ్ ఉంది కాబట్టి ఈమెకు అవకాశం రావడం పెద్ద విషయమేమీ కాదు.ఆ మధ్య ఈమె పెళ్లి కూడా తీసుకోబోతుంది అన్న వార్తలు వినిపించాయి. నిశ్చితార్థం కూడా జరిగింది కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ నీ ముద్దుగుమ్మ సడన్గా పెళ్లి మానేసి మళ్ళీ సినిమాలలో బిజీ కావాలని కోరుకుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి. దాంతో ఈమె ఆ విధంగా అవకాశాలు తప్పించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య ఒక సినిమాలో బాగా లావుగా కనిపించిన ఈమె తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. అందుకే ప్రేక్షకులకు ఆకర్షణీయంగా కనబడడం కోసం ఆమె అక్యూ స్కిన్ లిఫ్ట్ అనే  ఓ చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొహమంతా సూదులతో గుచ్చి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది.  మొహం నిండా సూదులు గుచ్చుకొని ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చింది.

ఈమె మాత్రమే కాదు చాలామంది హీరోయిన్లు అందంగా కనబడడం కోసం ఈ చికిత్స చేయించుకుంటారని తెలుస్తుంది మరి ఈ ముద్దుగుమ్మకు చికిత్స తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *