mattikusthi
mattikusthi

మూవీ : మట్టి కుస్తీ (Mattikusthi )
నటీనటులు : విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, శ్రీజ, రవి తదితరులు..
దర్శకుడు: చెల్ల అయ్యావు
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎమ్ నాథన్
ఎడిటర్ : ప్రసన్న జీకే
నిర్మాతలు : రవితేజ, విష్ణు విశాల్
రిలీజ్ డేట్ : 02 డిసెంబర్ 2022

రవితేజ (Raviteja) నిర్మాణంలో తొలి సినిమా తెరకెక్కగా ఈ మట్టి కుస్తీ (Mattikusthi) సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడు రవితేజ. తమిళంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విష్ణు విశాల్ (Vishnu vishal) హీరో గా నటించగా ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది.

స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలు ఉండగా ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వచ్చిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ

కేరళకు చెందిన కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కి రెజ్లింగ్ అంటే ఇష్టం. తల్లితండ్రులకు ఇష్టం లేకుండా బాబాయ్ సపోర్ట్ తో ఆమె రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుస్తుంది. అయితే తల్లి దండ్రుల ఒత్తిడి వల్ల నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే తన కలను వదిలేసి హీరో వీర (విష్ణు విశాల్ ) తో పెళ్ళికి సిద్ధపడుతుంది. ఓ పల్లెటూరు తో బలాదూర్ గా తిరుగుతున్న వీర కు పెళ్లి చేస్తే బాగుపడతాడని తల్లి దండ్రులు భావిస్తారు.

అయితే తనకు కాబోయే భార్య తనకంటే ఎక్కువగా చదవకూడదని, బాగా జుట్టు ఉండాలని వీర కోరుకుంటున్నాడు. కానీ వీర వాళ్ళ బాబాయ్ కీర్తి తక్కువే చదువుకుంది, జుట్టు కూడా బాగుందని పెళ్లి చేసేస్తాడు. ఆ తర్వాత ఆ నిజం బయటపడుతుంది. అప్పుడు వీర ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. కీర్తి కల నెరవేరుతుందా అనేడే సినిమా యొక్క కథ

నటీనటులు

కొత్త రకం కథలను ఎంచుకుంటూ ముందుకు పోతున్న విష్ణువిశాల్ ఈ సినిమా లోఉన్న కొత్త పాయింట్ ను చూసి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. తన పాత్ర కు పూర్తి న్యాయం చేశాడు.

కామెడీ సన్నివేశాల్లో , ఎమోషన్ సీన్స్ లో అందరిని అలరించాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో హైలైట్ అయ్యిది చెప్పాలి. హీరో తో పాటు సమానమైన పాత్ర లో చేసిన ఈమె యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది. ఇతర పాత్రధారులు తమ పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణులు

సినిమాలో ఓ మంచి సందేశాన్ని ఇమిడించారు. దాన్ని ప్రేక్షకులకు కామెడీ వే లో లో ప్రజెంట్ చేసి వారిని అలరించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అందరు ఇది స్పోర్ట్స్ డ్రామా సినిమా అని అనుకున్నారు. కానీ ఎమోషనల్ ను కూడా ఎంతో చక్కగా దర్శకుడు డీల్ చేశాడు.

అయన రాసుకున్న కథ బాగుంది. పాటల విషయంలో జస్టిన్ ప్రభాకరన్ ఎప్పటిలాగానే ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ లు పర్వాలేదు. ఇక రవితేజ నిర్మించిన ఈ సినిమా యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

కథా నేపథ్యం

హీరోయిన్ హీరోయిన్స్

వినోదం

మైనస్ పాయింట్స్

ఎక్స్పెక్ట్ చేసే సీన్స్

రొటీన్ క్లైమాక్స్

తీర్పు

ఎమోషన్ సినిమాలను చూడాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది. భార్య భర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాల్ని గుర్తు చేసిన సినిమా. ప్రతిఒక్క భర్త తప్పక చూడాల్సిన సినిమా.

రేటింగ్ : 2.75/5

Click Here For Hit2 Review And Rating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *