అడివి శేష్ హీరో గా నటించిన తాజా చిత్రం హిట్ 2 . శైలేష్ కొలను దర్శకుడు. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందగా ఈ సినిమా యొక్క ముందు భాగానికి మంచి పేరొచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఈ రెండో భాగం పై అందరి దృష్టిపడింది. మరి భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందొ ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

వరుసగా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడమే ఈ సినిమా యొక్క కథ. వైజాగ్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న హీరో కేడీ (అడివి శేష్) కి ఓ ఛాలెంజింగ్ మర్డర్ మిస్టరీ ని చేధించాల్సిన అవసరం వస్తుంది. నేరస్థులను చీప్ గా ట్రీట్ చేసే కేడీ కి ఈ కేస్ ఎంతో కష్టంగా మారుతుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ను నానా తిప్పలు పెడుతూన్న ఆ సీరియల్ కిల్లర్ ను హీరో ఎలా పట్టుకుంటాడు. అసలు అతను సీరియల్ కిల్లర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా కథ.

ఎప్పటిలాగే అడివి శేష్ తన కూల్ యాటిట్యూడ్ తో సినిమా ను ముందుకు తీసుకెళ్లాడు. పోలీస్ ఆఫీసర్ గా ఎంతో డిగ్నిటీ గా కనిపించాడు. సినిమా మొత్తం హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ పాత్ర కు సరిగ్గా సూట్ అయ్యాడు అడివి శేష్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయిన అడివి శేష్ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. ఎమోషన్ సీన్స్ లో మంచి పరిణితి కనిపించాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్ర కూడా ఎంతో బాగుంది. గ్లామర్ పాత్ర కాకపోయినా తన అందంతో ఆకట్టుకుంది. ఇక మిగితా పాత్రధారులైనా రావు రమేష్, సుహాస్, హర్ష లు మంచి నటన కనపరిచాడు.

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే దర్శకుడు శైలేష్ కొలను సినిమాను ఎంతో బాగా చేశాడనే చెప్పాలి. మరోసారి ఆసక్తికరమైన కథ తో మెప్పించాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎంతో బాగుంది. చివరిదాకా అందరిలో సస్పెన్స్ మైంటైన్ చేయగలిగాడు. కథ,కథనాలను ఎంతో బాగా ఎంగేజ్ చేయడంలో సఫలం అయ్యాడు.అన్ని విభాగాలు తమ తమ విభాగాల్లో మంచి ప్రతిభ కనపరిచారు. నాని నిర్మించిన ఈ సినిమా యొక్క నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎంతో నచ్చుతుంది. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా. కిల్లర్ ను కనిపెట్టే క్రమంలో హీరో చేసే ప్రయత్నాలు ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండ చూడాల్సిన సినిమా..

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *