hit2 review and rating
hit2 review and rating

నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, సుహాస్, రావు రమేష్, హర్ష, తనికెళ్ళ భరణి తదితరులు
దర్శకత్వం : శైలేష్ కొలను
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
సినిమాటోగ్రఫీ : ఎస్ మణికందన్
నిర్మాతలు : నాని, ప్రశాంతి త్రిపురనేని
ప్రొడక్షన్ : వాల్ పోస్టర్ సినిమా
సంగీతం : ఎమ్ ఎమ్ శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
రిలీజ్ డేట్ : 02-12-2022

క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలకు ఎల్లప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. అలా నాని నిర్మాణం లో రూపొందిన హిట్ సినిమా ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఇప్పుడు ఆ సినిమా కి కొనసాగింపుగా హిట్ 2 (Hit2) సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా లో అడివి శేష్ (Adivi Shesh) హీరో గా నటించడం విశేషం. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. మరి ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఏ స్థాయి లో ఉందొ తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ

క్రిమినల్స్ ను ఈజీ పెట్టుకోవచ్చు అనే మైండ్ సెట్ తో ఉంటాడు హీరో కేడీ (అడివి శేష్). వాళ్ళది కోడి బుర్ర అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో సంజన ఓ అమ్మాయి డెత్ కేసు కేడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అమ్మాయి శరీర భాగాలూ ముక్కలు ముక్కలు పడి ఉన్న ఈ కేసును ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఎంతో తికమకపడుతుంటారు. తల, మొండెం, కాళ్ళు, చేతులు వేరే వేరే బాడీ వని తెలిసి ఇంకా షాక్ అవుతారు. అసలు చనిపోయిన ఆ అమ్మాయిలు ఎవరు? ఈ సీరియల్ కిల్లర్ ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? దీన్ని కేడీ ఎలా చేధించాడు అనేదే సినిమా కథ.

నటీనటులు

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయాడు అడివి శేష్. మేజర్ హిట్ జోష్ అయన పేస్ లో కనిపిస్తుంది. సినిమా చేస్తున్నప్పుడు పాత్రలో ఎంతో ధీమా కనిపించింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. ఎమోషన్ సీన్స్ లో మంచి పరిణితి కనిపించాడు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary ) పాత్ర ఎంతో బాగుంది. ఫెమినిస్ట్ గా ఆమె నటించిన తీరు బాగుంది. సంప్రదాయంగా కనిపించి అందరిని మరోసారి తన హావభావాలతో ఆకట్టుకుంది. ఇక ఇతర పాత్రలలో నటించిన పాత్ర దారులు తమ పరిధి మేరకు ఆకట్టున్నారు. హర్ష, సుహాస్ , తనికెళ్ళ భరణి, రావు రమేష్ మరోసారి తమ నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు

దర్శకుడు శైలేష్ కొలను మరోసారి ఆసక్తికరమైన కథ తో మెప్పించాడు. హిట్ మొదటి భాగం సినిమా కు ఎలాంటి సంబంధం లేకుండా ఈ సినిమా కథ ను ఎంతో బాగా మలిచాడు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎంతో బాగుంది. చివరిదాకా అందరిలో సస్పెన్స్ మైంటైన్ చేయగలిగాడు. కథ,కథనాలను ఎంతో బాగా ఎంగేజ్ చేయడంలో సఫలం అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ ఎంతో బాగున్నాయి. ఎడిటింగ్ సరిగ్గా కుదిరింది. పాటల విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా యొక్క నిర్మాణ విలువలు ఎంతో రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

కథ, కథనం

దర్శకత్వం

హీరో

మైనస్ పాయింట్స్

పాటలు

అక్కడక్కడా స్లో గా ఉండడం

తీర్పు

క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎంతో నచ్చుతుంది. హిట్ ఫ్రాంచైజ్ లో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా. కిల్లర్ ను కనిపెట్టే క్రమంలో హీరో చేసే ప్రయత్నాలు ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండ చూడాల్సిన సినిమా..

రేటింగ్ : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *