సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిన్ కి సక్సెస్ ఈజీగా వస్తుందని చాలామంది అభిప్రాయం. కానీ పెద్ద స్టార్ హీరోయిన్ అవడం మాత్రం కాస్త కష్టమే. అయితే అలా ఓ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో ఓ ఊపు ఊపి ఆ తర్వాత కనుమరుగైపోయి బామ్మ పాత్రలో నటించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. గోపీచంద్(gopichandh) హీరోగా వచ్చిన యజ్ఞం సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలిసిందే. ఆ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సమీరా బెనర్జీ.

కోల్కత్తా కి చెందిన ఈ హీరోయిన్ చిన్న వయసు నుండే ఎన్నో యాడ్స్ లో నటించి మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సమీరా బెనర్జీ (sameera benarji)దాదాపు 100కు పైగా కమర్షియల్ యాడ్స్లో నటించి టాప్ మోడల్ గా పేరుగాంచింది. ఈ హీరోయిన్ మొదట ఓ బంగ్లాదేశ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ కెరీర్ ని మలుపు తిప్పిన యజ్ఞం సినిమాలో హీరోయిన్గా అవకాశం కొట్టేసింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా ఏ హీరోయిన్ వచ్చినా వారిని పెట్టే వరుసగా సినిమాలు తీస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు.

అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమీరా బెనర్జీ తనకి కూడా వరుస ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ ఈమె అదృష్టం బాగా లేక ఒక్క ఆఫర్ కూడా ఈ హీరోయిన్ కి రాలేదు. ఇక ఈమె జీవితం సీరియల్స్(serials) ద్వారా ప్రారంభమై మళ్లీ అవే సీరియల్స్ వైపు ఈమె అడుగులు వేసింది. ఈ హీరోయిన్ ఓ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకొని పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమై ఓ బాబు పుట్టాక మళ్ళీ ఇండస్ట్రీ లోకి రియంట్రి ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎవరు అంత తొందరగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించలేదు.

కానీ సమీరా బెనర్జీ మాత్రం ఏకంగా తల్లి, అత్త పాత్రల్లోనే కాకుండా కొన్ని సీరియల్స్ లో బామ్మ పాత్రల్లో కూడా నటించింది. అయితే ఈ హీరోయిన్ మాత్రం అవకాశం వస్తే చాలు ఏ పాత్ర అయితే ఏంటి నటించడానికి అంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా చేసి అవకాశాలు లేక బామ్మపాత్రలో కూడా నటించిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *