Actress Lakshmi: అప్పట్లో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నటిగా సంచలనం.. ఎక్కువ  తక్కువ అహం చూపించడమే కారణమన్న... | Actress Lakshmi: The reason for getting  three marriages | TV9 Telugu

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం చాలా కష్టం.. కొంతమంది జీవితాలు ఉన్నత స్థానానికి చేరుకుంటే.. మరి కొంత మంది జీవితాలు ఉన్నఫలంగా పాతాళానికి తొక్కివేయబడతాయి. సాధారణంగా అందరిలాగే సెలబ్రిటీల జీవితాలలో కూడా కష్టాలు ఉంటాయి. డబ్బులు హోదా ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా సీనియర్ నటి లక్ష్మీ గురించి నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది..

ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్గా సక్సెస్ పొందాలనుకున్నా . సక్సెస్ పొందలేక ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా లక్ష్మీ అనేక చిత్రాలలో నటించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా లక్ష్మి మురారి సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. సినిమాల ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమె ఓ బేబీ సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో నటించింది. అయితే సినిమా పరంగా ఉన్నత జీవితాన్ని గడిపిన లక్ష్మి వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురి అయింది.

కేవలం 15 సంవత్సరాల వయసులోనే భాస్కర్ అనే వ్యక్తితో మొదట వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా సినిమాలలో నటించింది లక్ష్మీ. కానీ ఆమె సినిమాలలో నటించడం భర్తకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అలా కష్టపడుతూనే ఐదు సంవత్సరాలు గడిపిన వీరు ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న లక్ష్మి మలయాళ నటుడు మోహన్ ను వివాహం చేసుకుంది . అయితే వీరిద్దరూ కూడా పెళ్లయిన కొన్నాళ్ళకి విడిపోయారు. ఆ తర్వాత ఏడేళ్లకు 1987లో శివచంద్రన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది.

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఇప్పటికీ సినిమాలలోనే కొనసాగుతోంది లక్ష్మి.. దీన్ని బట్టి చూస్తే ఈమెకు సినిమాలపై ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈమె లాగే చాలామంది సినిమాల కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టినవారు ఉన్నారటంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *