బిగ్ బాస్(biggboss) సీజన్ 6 లో ఏ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అంటూ ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది.ఎందుకంటే కేవలం ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్న నేపథ్యంలో టాప్ ఫైవ్ లో ఎవరుంటారు.ఎవరు టైటిల్ విన్ అవుతారు అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇక హౌస్ లో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న సింగర్ రేవంత్ తన మాటలతో కొంచెం నెగిటివిటీ ని మూటగట్టుకుంటున్నారు. ఈయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఆ నెగెటివిటీ వల్ల కొన్ని ఓట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇంటి సభ్యులు సైతం ఆయన లో ఉన్న కోపాన్ని బయటపెట్టి ఆయన కు తక్కువ ఓట్లు పడేలా చేస్తున్నారు.

ఈ విషయం పక్కన పెడితే బిగ్బాస్ 6 లో మిగతా వాళ్ల కోసం ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ యాజమాన్యం బలి చేస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఎందరో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.అలాగే ఇప్పటికే 13 వారాలు అయిపోయాయి. హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.ఇక ఈవారం శ్రీహాన్ (srihaan)ని ఎవరు నామినేట్ చేయకపోవడంతో ఆయన నామినేషన్స్ లో లేరు.అలాగే ఇనయ కెప్టెన్ కారణంగా ఆమె కూడా నామినేషన్స్ లో లేదు. నామినేషన్ లో ఆరుగురు ఇంటి సభ్యులు ఉన్నారు.

ఇక హౌస్ లో టికెట్టు ఫినాలే కోసం బిగ్బాస్ ఓ టాస్క్ పెట్టాడు. వీరిలో ఇనాయ,శ్రీ సత్య(srisathya) గేమ్ నుంచి అవుట్ కాగా మిగతా ఆరుగురి మధ్యన పోటీ నెలకొంది.ఇదిలా ఉంటే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి మంచివాడిగా గుర్తింపు తెచ్చుకొని చాలా కామ్ గా ఉండి తన పని తాను చేసుకొని పోతున్న రోహిత్ కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఎందుకంటే నామినేషన్స్ లో అయినా,ఏదైనా గేమ్లో అయినా, రోహిత్ ఆడే సీన్లను బిగ్బాస్ ఎక్కువగా చూపించడం లేదని నెట్టింట్లో ఓ టాక్ మొదలైంది. కేవలం రోహిత్ ఆట ఆడే విషయంలోనే కాదు తన భార్యకు చెప్పిన ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా బిగ్బాస్ టెలికాస్ట్ చేయలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.

అదేంటంటే రోహిత్ తన భార్యకు మ్యారేజ్ యానివర్సరీ విషెస్ తెలిపిన విషయాన్ని కూడా బిగ్బాస్ టెలికాస్ట్ చేయలేదంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు బిగ్బాస్ యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కావాలనే బిగ్ బాస్ రోహిత్(rohith) కి ఓటింగ్ రాకూడదు అని నిర్ణయం తీసుకొని మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్ ని టాప్ ఫైవ్ లో ఉంచేందుకే ఇలా రోహిత్ ఆడే గేమ్ని టెలికాస్ట్ చేయడం లేదు అంటూ నెటిజన్లు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతున్నారు. అంతేకాదు రోహిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్..ఆయన ఆట తీరును ప్రేక్షకులు చూస్తే ఖచ్చితంగా ఆయనకు ఎక్కువ ఓట్లు వేస్తారు. ఇక ఈ భయంతోనే బిగ్బాస్ యూనిట్ ఆయన ఆటను చూపించకుండా కేవలం మిగతా వారి ఆటనే చూపిస్తుంది అంటూ బిగ్ బాస్ యూనిట్ పై చాలా మంది నెటిజెన్లు విమర్శలు చేస్తున్నారు. ఇక చివరికి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *