Actress Sri Lakshmi, కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. చివరికి  పిల్లల్లేకుండా పోయారు: నటి శ్రీలక్ష్మి - i don't have children that's my  mistake says actress sri lakshmi ...ఎన్నో తెలుగు సినిమాలలో లేడీ కమెడియన్ గా నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న ప్రముఖ నటీమణి శ్రీ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం కొన్ని డైలాగ్స్ తో భారీ పాపులారిటీని దక్కించుకున్న ఈమె తెలుగు ప్రొడ్యూసర్ అమర్నాథ్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. శ్రీ లక్ష్మీ తండ్రికి అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు మొదలవడంతో సినిమాల్లో చిన్న పాత్రలతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. శ్రీ లక్ష్మీ సోదరుడు రాజేష్ కూడా హీరోగా సినిమాలలో నటించారు. ఇప్పుడు ఆయన కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్థిక ఇబ్బందులతో సినిమాలలోకి అడుగు పెట్టిన శ్రీలక్ష్మి చాలా సినిమాలలో కామిక్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. జంధ్యాల, కె విశ్వనాథ్ గారి సినిమాలలో మంచి పాత్రలతో నంది అవార్డులను సైతం తెచ్చుకున్న శ్రీ లక్ష్మీ.. కుటుంబ బాధ్యతలతో తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకుంది. పిల్లలు పుడితే సినిమా కెరియర్ లో ఇబ్బందులు వస్తాయని.. ఇంకా ఇంట్లో తీర్చాల్సిన అప్పులు.. బాధ్యతలు ఉన్నాయని.. పిల్లల్ని కనడం వద్దనుకుని.. ఆ తర్వాత మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు పుట్టలేదు… వయసు పెరగడం.. థైరాయిడ్ సమస్యలతో పిల్లలు లేకుండా పోయారంటూ ఎమోషనల్ అయింది.

అయితే కుటుంబం గురించి ఆలోచించి తన జీవితాన్ని పణంగా పెట్టిన శ్రీలక్ష్మి ఇప్పుడు కుమిలి పోతోంది. దేవుడు ఏదో ఒక కొరత మనిషికి పెడతాడు అలా నాకంటూ సొంత కుటుంబం లేకుండా చేశాడు అంటూ ఆమె మరింత ఎమోషనల్ అయ్యింది. ఎప్పుడు కుటుంబ బాధ్యతలే ముఖ్యం అని ఆలోచించిన నాకు దేవుడు కఠినంగా బ్రతకమని కూడా శాసించాడు అంటూ మరింత ఎమోషనల్ అయింది.

పిల్లలే కదా మళ్ళీ పుడతారులే అనుకున్నా.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ చెప్పిన శ్రీలక్ష్మి ప్రస్తుతం పలు సీరియల్స్ లో కూడా నటిస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రామ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. కుటుంబ బాధ్యతల కోసం ఆరోజు తీసుకున్న ఆ తప్పు నిర్ణయం వల్ల నేడు ఒంటరి జీవితానికి పరిమితమైంది శ్రీలక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *