సీనియర్ హీరోయిన్ రోజా అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ప్రేమతపస్సు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేయించుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు కొట్టేసింది. అలాగే సమ్మక్క సారక్క వంటి లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మరింత ఫేమస్ అయింది. ఇక కెరియర్ పిక్స్ లో ఉండగానే డైరెక్టర్ సెల్వమణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాల్లో నటించి పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరం అయింది.

ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అమ్మ,అత్త పాత్రల్లో మెప్పించింది. అలాగే బుల్లితెర మీద ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ లో జడ్జిగా చాలా సంవత్సరాలు చేసింది. నటి రోజా కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం రోజా వైసిపి పార్టీలో మంత్రి గా కొనసాగుతోంది. అయితే మంత్రి అవ్వడం వల్ల రోజా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.ఇక రోజా భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లోకి రియంట్రీ ఇచ్చే ఛాన్సులు బాగానే ఉన్నాయి.అయితే ఈమె తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించింది.

కానీ రోజా కి మాత్రం ఓ సినిమాలో నటించాలని ఉందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన అరుంధతి సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే సీనియర్ నటి రోజా కి కూడా అరుంధతి వంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల్లో నటించాలని ఓ కోరిక ఉందట. ఇక ఇన్నేళ్ల వయసు వచ్చినా కూడా రోజాకి అలాంటి సినిమాలో నటించాలని ఆశ ఉందట. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అరుంధతి సినిమా నటిగా అనుష్కకి అలాగే డైరెక్టర్గా కోడి రామకృష్ణ కి కూడా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.

ఇక ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కంటే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే రోజా అరుంధతి తరహా సినిమాల్లో నటించాలనుకోవడం ఇప్పుడు పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే రోజా వయసు50 సంవత్సరాలు. ఇక ఇలాంటి ఏజ్ లో ఒకవేళ రోజా కి అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం ఆమె అభిమానులు ఆమెను యాక్సెప్ట్ చేయలేరు అంటూ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి రోజా కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *