అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ -2 (hit)సినిమా తాజాగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ముందుకు పోతుంది. ఈ సినిమాకి శైలేష్ కొలను డైరెక్టర్ వహించగా ప్రశాంతి త్రిపిరినేని, హీరో నాని సంయుక్తంగా నిర్మించారు. మొదటి హిట్ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించగా..హిట్ -2 సినిమాలో అడివి శేష్ హీరోగా నటించారు. ఈ సినిమా చాలా బాగుందని మొదటి షో చూసిన ప్రేక్షకులు చెప్పడంతో సినిమా హిట్ అంటూ అందరూ భావిస్తున్నారు.

ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి(meenakshi choudary) హీరోయిన్ గా నటించింది. ఇక హిట్-2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.అడివి శేష్ మాట్లాడుతూ..నేను ఓ అమ్మాయి తో చాలా సన్నిహితంగా ఉంటాను. అది ప్రేమో లేక అట్రాక్షనో నాకు అర్థం అవడం లేదు. ఆ అమ్మయిది కూడా హైదరాబాదే. అయితే ఆమె మీద ప్రేమ ఉన్నప్పటికీ గర్ల్ ఫ్రెండా కాదా అనే విషయంలో సందిగ్ధంలో పడ్డాను.

ఎందుకంటే ప్రస్తుతం ఆమెతో నా రిలేషన్ ఏంటో చెప్పలేకపోతున్నాను. ప్రస్తుతం అటు స్నేహితురాలికి ఇటు ప్రేమికురాలికి మధ్యలో ఉంది. అయితే ఆ అమ్మాయిని నేను ప్రేమలో పడేయకపోవడానికి ప్రధాన కారణం నేను ఆ అమ్మాయితో ఎక్కువగా టైం స్పెండ్ చేయకపోవడమే. నేను ఇప్పటివరకు నా ఫ్యామిలీకే సమయం కేటాయించను. అంతే కాదు స్నేహితులకు కూడా ఏ ఒక్కరోజు టైం కేటాయించలేదు. నా ఫోకస్ ఎక్కువగా సినిమాల మీదే ఉంటుంది.

అయితే ఇలాంటి టైం లో ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆమెకు టైం కేటాయించగలనా అనే అనుమానం నాలో ఉంది. అందుకే ప్రస్తుతం ఆ అమ్మాయితో నా రిలేషన్ ఏంటో చెప్పలేకపోతున్నాను అంటూ అడివి శేష్(adivi sesh) తన లవ్ గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం అడివి శేష్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయితే తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని క్లారిటీ ఎప్పుడు ఇస్తారో తెలియాలంటే ఇంకోన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *