జంబలకడిపంబ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై శుభలగ్నం (SHUBHALAGNAM)సినిమాలో ఏమిటో అనే ఓ డైలాగ్ తో ఒక్కసారి గా ఫేమస్ అయింది నటి ఆమని. సీనియర్ నటి ఆమని ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కమర్షియల్ డైరెక్టర్లతో పాటు ప్రముఖ దర్శకులైన బాపు,కే విశ్వనాథ్ లతో కూడా పనిచేసే అదృష్టాన్ని ఆమె దక్కించుకుంది. ఇక ఈమె హీరోయిన్ గా సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అనుకోకుండా పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.

ఆ తర్వాత రాజేంద్రప్రసాద్(RAJENDRA PRASAD) హీరోగా వచ్చిన ఆ నలుగురు సినిమాతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే అప్పట్లో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.ఆమని మాట్లాడుతూ.. నేను జంబలకడిపంబ సినిమాలో నటించేటప్పుడు ముందుగా కథ నాకు డైరెక్టర్ చెప్పలేదు. కానీ స్పాట్ లో వచ్చి డైరెక్టర్ కథ చెప్పారు. అంతేకాదు నువ్వు ఇప్పుడు సిగరెట్ తాగాలి అని ఓ సన్నివేశాన్ని చెప్పారు. కానీ డైరెక్టర్ అలా అనడంతో నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయాను.

ఏంటి నిజంగానే నేను ఇప్పుడు సిగరెట్ తాగాలా అని మరోసారి అడిగాను. దానికి డైరెక్టర్ ఏం కాదమ్మా నువ్వు రెండుసార్లు పీల్చి వదిలై అంటూ చెప్పారు. ఇక చేసేదేమీ లేక నేను రెండుసార్లు సిగరెట్ తాగాను. నేను ఎవరినైనా గట్టిగా నమ్మితే ప్రతి విషయంలో వారిని గుడ్డిగా నమ్మేస్తాను. కానీ కొన్ని సందర్భాలలో నా మంచితనాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అలా నేను కొంతమందిని నమ్మి కోట్లలో డబ్బు పోగొట్టుకున్నాను . నేను మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది.

అలాగే స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ స్పెషాలిటీ వేరుగా ఉంటుంది.కానీ ఫెడౌట్ అయ్యాక మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ అనే పదం నాకు తెలిసి లేదు. కానీ కొన్ని కొత్త కంపెనీలలో అలాంటివి ఉంటాయి. ముందు కొత్త హీరోయిన్ ఎవరినైనా చూస్తే బాగున్నావు మా సినిమాకి సెట్ అవుతావు అని చెప్పి ఆ తర్వాత ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కి రండి ఒకసారి మేకప్ టెస్ట్ చేసి చూద్దాం అని అనేవారు. ఇక అప్పుడే అర్థమైపోయేది వాళ్ళు ఎలాంటి వారో అంటూ ఆమని(AAMANI) ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *