రామ్ చరణ్ హీరో గా శంకర్ చేయబోయే సినిమా కి బజ్ కనిపించడం లేదన్నది కొంతమంది మెగా అభిమానులు చెబుతున్న మాట. సమకాలీన రాజకీయాలపై శంకర్ సంధిస్తున్న వ్యంగ్యాస్త్రంగా ఈ మూవీని పేర్కొంటున్నారు. ఇందులో రామ్ చరణ్ తండ్రిగా తనయుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఇప్పటికే బయటికి లీక్ అయిన చరణ్ ఓల్డ్ లుక్ ఫొటోస్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కోసం శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తో తాను కూడా విజయాల బాటలోకి నడవాలని భావిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ప్లానింగ్ అంతా ఓకే శంకర్ జీ ఈ రెండు సినిమాలకు బజ్ కనిపించడం లేదే అని కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ రెండు క్రేజీ సినిమాల షూటింగ్ లకు వర్క్ చేస్తుండటంతో శంకర్ కొంత ఒత్తిడికి లోనవుతున్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *