ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక సినిమా ప్రారంభం అయ్యింది. యాక్సిడెంట్ కారణంగా ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో తేజ్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు జయంత్ పానుగంటి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి.

చిత్ర యూనిట్ సభ్యులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరిగా అయన రిపబ్లిక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. దాంతో అయన అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా మొదలుపెడతాడా అని ఎదురుచూశారు.

అతి త్వరలోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని.. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ నటించబోతున్న వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ లో కూడా సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడట. ఆ సినిమా విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *