BO Rewind: Rajinikanth And Chiranjeevi Couldn't Beat It For Yearsకోలీవుడ్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్.. టాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇద్దరు కూడా నటనలో ప్రావీణ్యం పొంది.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో కొచ్చి తమ నటనతో సంచలనం సృష్టిస్తూ ప్రేక్షకుల మదిని ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల ప్రశంసలు కూడా పొందుతున్నారు. వీరిద్దరూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ వీరిద్దరికీ జరిగిన అవమానాల గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి.

ఇటీవల ప్రముఖ నిర్మాత, నటుడు అయిన జీవి నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించారు. జీవి నారాయణరావు చిరంజీవికి మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఆఫ్ బీట్ సినిమాలు అంటే ఎక్కువ ఆసక్తి ఒక ఊరి కథ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది అంటూ జీవి నారాయణరావు వెల్లడించారు. సుధాకర్ కు భారతి రాజా వేషం ఇచ్చారని, చిరంజీవికి ఇవ్వలేదని చెప్పిన జీవి నారాయణరావు.. రజనీకాంత్, నేను ఆఫీసులకు వెళ్ళామని.. నాకు ఛాన్స్ లు ఇచ్చి రజనీకాంత్ కి ఛాన్స్ ఇవ్వని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని జీవి నారాయణరావు వెల్లడించారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వీళ్లకు అవకాశాలు అంత త్వరగా రాలేదు. అలా ఎన్నో అవమానాలు పడ్డారు.

అప్పట్లో అవకాశాల కోసం అవమానాలను ఎదుర్కొన్న వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. రజినీకాంత్ విలన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చారు.. కానీ సూపర్ స్టార్ హీరోగా ఎదిగారు.. చిరంజీవి గారికి ఫైట్స్, డాన్స్ అంటే చాలా ఇష్టం అంటూ కామెంట్లు చేశారు. అయితే వీరిద్దరూ 65 సంవత్సరాల వయసు దాటినా కూడా వరుస ఆఫర్లతో బిజీ అవుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతికి వస్తున్నారు.. మరి ఈ రెండు సినిమాలపై ప్రస్తుతం మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా రికార్డు స్థాయిలో థియేటర్ లలో విడుదల కాబోతూ ఉండడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *