Telugu Actor Suman Clears The Air on Rumors About His Ill Healthటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మరింత పాపులారిటీని దక్కించుకున్న హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో చిరంజీవి లాంటి స్టార్ హీరోలకి కూడా పోటీ ఇస్తూ వరుస విజయాలు అందుకున్నారు. అయితే కొంతకాలానికి కెరియర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేయడానికి ఒప్పుకుంటున్నారు. సుమన్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో నీలి చిత్రాల కేసులో సుమన్ జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది.

అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సుమన్.. అయితే ఎందుకు అరెస్టు చేశారో చెప్పడానికి తన వద్ద కానీ పోలీసుల వద్ద కానీ ఎటువంటి సమాధానం లేదని తెలిపిన సుమన్.. సైదాబాద్ కోర్టులో హాజరు పరిచారని తెలిపారు. ముఖ్యంగా కోర్టులో అమ్మాయిలను వేధించినట్టు.. నీలి చిత్రాలు తీసినట్టు.. ఆరోపించి కేసులు వేశారని సుమన్ తెలిపారు. కానీ ఎవరి దగ్గర సరైన ఆధారాలు లేవని తెలిపిన సుమన్.. ఆధారాలు అడిగితే ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పేవారు అని సుమన్ తెలిపారు. అంతేకాదు తనపై యాంటీ గుండా యాక్ట్ , ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం వల్ల తనకు బెయిల్ కూడా దొరకలేదని.. తనను దారుణమైన గదిలో జైలులో బంధించి ఉంచారు అని తెలిపారు.

ఒకసారి కరుణానిధి గారు వచ్చి తన పరిస్థితి చూసి చలించిపోయి.. జైలు అధికారులను హెచ్చరించి.. తనను వేరే గదికి మార్పించారని చెప్పారు. అయితే తనపై జరిగిన ఒక పొలిటికల్ కుట్ర వల్లే జైలు జీవితం అనుభవించాను అని తెలిపారు. అయితే సుమన్ ను ఇలా కావాలని కేసులో ఇరికించి జైలుకు పంపించింది ఎవరు? అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది.

అయితే సుమన్ ను అరెస్టు చేయాలనుకున్న రోజు అర్ధరాత్రి సుమన్ తలుపులు తట్టి మరీ అసలు కారణం చెప్పకుండా పోలీసులు అరెస్టు చేయడం చూసి నిర్గాంత పోయారట. కానీ తేరుకొని అడిగినా కూడా ఎవరు ఏ సమాధానం చెప్పలేదట. చివరికి కోర్టులో ఇలా జరిగిందని తెలిసేసరికి ఆయన మరింత కృంగిపోయారు. కానీ సుమలత , జయసుధ వంటి హీరోయిన్లు సుమన్ కు అండగా నిలిచి ఆయన నిర్దోషని నిరూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *