ఇటీవల కాలంలో గాసిప్స్ ఎంతలా వైరల్ అవుతున్నాయి అంటే హీరోయిన్స్ కొంచెం డైటింగ్ చేయడం మానేసి పొట్ట ముందుకు వచ్చినా లేదా వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నా సరే గర్భవతులు అంటూ రకరకాల వార్తలు రాసేస్తున్నారు.. ఊహించని రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నారు. మరి టాలీవుడ్ ను మొదలుకొని కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలు ఇలా తల్లులవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది నిజంగానే గర్భవతులుగా మారి పిల్లలకు జన్మనిస్తే.. మరికొంతమంది ఎటువంటి సంకేతం లేకుండా.. ఇలాంటి రూమర్స్ ఎదుర్కొన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.

అలియా – రణబీర్ కపూర్:
బాలీవుడ్ లోనే కాదు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత ఆకర్షణీయమైన జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆలియా భట్ – రణబీర్ కపూర్ జంట. అయితే వివాహమైన రెండు నెలలకే ఆలియా గర్భిణీ అని ప్రకటించింది. ఇటీవల అమ్మాయికి కూడా జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ పెళ్లయిన రెండు నెలలకే ప్రెగ్నెంట్ అని ప్రకటించి.. విమర్శలు ఎదుర్కొంది ఆలియా. కానీ ప్రస్తుతం వీరిద్దరూ తమ పాపతో చాలా సంతోషంగా ఉన్నారు.

ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్:
అతిలోకసుందరి ఐశ్వర్యారాయ్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈమె మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన ఈ మాజీ విశ్వసుందరి వదులైన దుస్తులు ధరించి ఉండడాన్ని చూసి ఒకటే వార్తలు ..ఆమె గర్భవతి అయిందని.. త్వరలోనే మరో బిడ్డకు జన్మనిస్తోంది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను కొట్టి పారేశారు ఐశ్వర్యరాయ్. ఇప్పటికే వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహమై ఒక కూతురు కూడా ఉంది.

కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్:
బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న నటి కత్రినా కైఫ్.. అయితే తాజాగా ఈమె గర్భంతో ఉందంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. తన భర్త విక్కీ కౌశల్ తో కత్రినా ఉన్న ఫోటోలు పట్టుకుని అందులో ఆమె బేబీ బంప్ తో కనిపించారంటూ రకరకాల వార్తలు వైరల్ చేశారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

మలైకా అరోరా – అర్జున్ కపూర్:
అయితే 49 సంవత్సరాల మలైక గర్భంతో ఉన్నారంటూ తాజాగా ఒక వెబ్సైట్ లో కథనాలు వినిపించాయి. దీనిపై అర్జున్ కపూర్ సీరియస్ అయ్యి.. మీరు ఇలాంటి వార్తలు చాలా సాధారణంగా అనుకుంటున్నారు. కానీ వాటి వల్ల మేము ఎంత బాధ పడుతున్నామో మాకు తెలుసు.. కాబట్టి దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దండి అంటూ సోషల్ మీడియా పై కన్నెర్ర చేశారు.

ఉపాసన – రాంచరణ్:
ఉపాసన తన గొప్ప మనసు చాటుతూ తన ఇంట్లో పని చేసే పనిమనిషి వీధిలో జరిగే వినాయక చవితికి.. వదులుగా ఉండే డ్రెస్ వేసుకెళ్ళింది. కానీ అది చూసిన కొంత మంది ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ రకరకాల వార్తలు వైరల్ చేశారు. కానీ ఇందులో నిజం లేకపోయింది. ప్రస్తుతం గర్భవతుల కాలం అంటూ చాలామంది దీనిని బాగా ట్రెండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *