సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) ఏం చేసినా సంచలనమే. ఆయన మాత్రమే కాదు అయన పిల్లలు కూడా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా మహేష్ కూతురు సితార (Sitara) అయితే సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది. ఆమె తన రీల్స్ తో ఇప్పటికే ఎంతో మంది అభిమానులను మూటకట్టుకుంది. అయితే గౌతమ్ (Gautham) మాత్రం ఎక్కువగా కనిపించింది లేదు.

తండ్రి లాగే ఎంతో లో ప్రొఫైల్ ను మైంటైన్ చేస్తుంటారు. ఆ విధంగా తాజాగా అయన స్కూల్ లో చేసిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకి వచ్చింది. స్కూల్ లో అయన పెర్ఫర్మ్ చేస్తున్న ఓ వీడియో ను అయన తల్లి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) విడుదల తన ఇంస్టాగ్రామ్ లో విడుదల చేసింది.

ఆమె షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందరు షేర్ ల మీద షేర్ లు చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ అభిమానులు అయితే తండ్రికి తగ్గ తనయుడు అంటూ పొగుడుతున్నారు. భవిష్యత్ లో అయన కూడా హీరో అవ్వాలని వారు కోరుతున్నారు.

ఇక ఇటీవలే మహేష్ తండ్రి కృష్ణ చనిపోవడంతో అందరు ఆ బాధ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. అందులో భాగంగా తన సినిమాల షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అయన సినిమా చేస్తుండగా ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *