శ్రీదేవిని పెళ్లి చేసుకోమని ప్రపోజల్.. అందుకే రిజెక్ట్ చేశా.. రాజశేఖర్ | Hero Rajashekhar shock on Sridevi death - Telugu Filmibeat

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. దివి నుంచి భువి కి దిగివచ్చిన దేవకన్యలా తన అందంతో ,నటనతో ప్రేక్షకులను మంత్రం ముగ్ధులని చేసింది. హీరోలతో హీరోయిన్లకు ఎక్కడ పోటీ లేని సమయంలోనే.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకున్న ఈమె తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో మకుటం లేని మహారాణిగా కొనసాగింది. ఇంత గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మను వివాహం చేసుకోవాలని అప్పట్లో హీరోలు మాత్రమే కాదు దర్శక నిర్మాతలు కూడా పోటీపడ్డారు.

కానీ టాలీవుడ్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరో కూడా ఉన్నారు.ఆయన ఎవరో కాదు యాంగ్రీ యంగ్ మాన్ గా.. యాక్షన్ మూవీస్ లో నటిస్తూనే మరో పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన డాక్టర్ రాజశేఖర్.. రాజశేఖర్ కు శ్రీదేవికి వివాహం జరగాల్సి ఉంది . కానీ కొన్ని కారణాలవల్ల ఆగిపోయిందట.. వీరి వివాహం ఆగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే? నిజానికి వీరు ఇద్దరు కూడా తమిళనాడుకు చెందినవారే.. రాజశేఖర్ తండ్రి , శ్రీదేవి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు కూడా.

ఈ క్రమంలోనే శ్రీదేవి, రాజశేఖర్ లకు పెళ్లి చేయాలని కూడా పెద్దలు నిశ్చయించారు. అప్పటికి రాజశేఖర్ ఇంకా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వలేదు . కానీ శ్రీదేవి అప్పటికే సినిమాలలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తోంది.అయితే రాజశేఖర్, శ్రీదేవి వివాహానికి రాజశేఖర్ తల్లి గారు అంగీకరించలేదు. సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని రాజశేఖర్ తో ఆమె ఒట్టు కూడా వేయించుకుందట . అందుకే వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది.

అయితే అనుకోకుండా రాజశేఖర్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం , అతను కూడా స్టార్ గా ఎదగడం చివరికి సినీ పరిశ్రమకు చెందిన జీవిత ను వివాహం చేసుకోవడం అంతా జరిగిపోయింది. 1991 వ సంవత్సరంలో మగాడు అనే చిత్రం చేస్తున్న సమయంలో రాజశేఖర్ గాయాల పాలయ్యారు. అదే సమయంలో జీవిత దగ్గరుండి మరి రాజశేఖర్ కు సేవలు చేయడం చూసిన రాజశేఖర్ తల్లిదండ్రులు వీరిద్దరికి వివాహం చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *