వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేనితో `వీర సింహారెడ్డి` అనే సినిమాను పట్టాలెక్కించాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. క‌న్న‌డ న‌టుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నాడు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య(waltair veerayy)` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌నే హీరోయిన్ కాగా.. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలోనే దింపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఓకే బ్యానర్ పై నిర్మితమైన ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుండడంతో అందరి చూపులు `వీర సింహారెడ్డి`, `వాల్తేరు వీరయ్య` ల పైనే ఉన్నాయి.

అయితే ఈ సినిమాల విషయంలో ఓ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. సాధార‌నంగా బాలయ్య-చిరు మధ్య ఎప్పుడు బాక్సాఫీస్ పోటీ జరిగిన భ‌లే మ‌జాగా ఉంటుంది. అయితే సంక్రాంతి బరిలో ఈ ఇద్దరు సీనియర్ స్టార్లు రెండుసార్లు హోరాహోరీగా పోటీపడ్డారు. 1999 సంక్రాంతికి చిరు `స్నేహం కోసం` సినిమాతో వస్తే.. బాలయ్య `సమరసింహారెడ్డి(samarasimha reddy)` తో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ రెండు చిత్రాల్లో సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత 2001 సంక్రాంతికి బాలయ్య `నరసింహనాయుడు`, చిరు `మృగరాజు(mrugaraju)` చిత్రాలతో వచ్చాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు సినిమాల్లోనూ సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈసారి కూడా బాలయ్యనే పై చేయి సాధించాడు. మృగ‌రాజు డిజాస్టర్ అవ్వగా.. నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ సీనియర్ హీరోలు పోటీ పడుతున్నారు. మరి పాత సెంటిమెంట్ రిపీట్ అయితే బాలయ్యకు బ్లాక్ బ‌స్టర్, చిరుకు డిజాస్టర్ పడటం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానుల సైతం ఈ సెంటిమెంట్ ఎక్కడ రిపీట్ అవుతుందో అని కాస్త కలవర పడుతున్నారు. మరి చిరు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి హిట్ కొడతాడా..? లేక ఈ సారి కూడా బాలయ్యనే పై చేయి సాధిస్తాడా..? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *