Here's birthday special poster of Aishwarya Rajesh from The Great Indian  Kitchen Tamil remake; Trailer soon | PINKVILLAప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మికి స్వయానా మేనకోడలు.. ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు , తమిళ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఎక్కువగా పాత్ర నచ్చితే సెకండ్ హీరోయిన్గా నటించడానికి కూడా వెనకాడదు. అంతలా తన పాత్రలతో పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ఉంటుంది ఐశ్వర్య రాజేష్ . ప్రస్తుతం తమిళనాడులో మాత్రం చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది.

ఇటీవల తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాలో విజయ్ సరసన నటించి తన నటనతో శభాష్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగమ్మాయి అయినా తమిళంలో ఎక్కువగా నటించడం వల్ల అక్కడ మంచి పేరు లభించింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ తాను కూడా లైంగిక వేధింపులకు, అవమానాలకు గురి అయ్యాను అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పి అసలు విషయాన్ని బయటపెట్టింది.

తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగా ఉంది. నటీమణులను చాలా తక్కువ చేసి చూస్తున్నారు అంటూ కామెంట్లు చేసింది..”నా కెరియర్ మొదట్లో నేను కూడా ఎన్నో లైంగిక వేధింపులతో పాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాను. నేను నల్లగా ఉన్నాను అన్న కారణంగా చాలామంది దర్శకులు నన్ను అవహేళన చేశారు. ఒక స్టార్ డైరెక్టర్ అయితే ఏకంగా అసలు నేను హీరోయిన్ మెటీరియల్ కాదు అని కించపరిచాడు.

అంతేకాదు కమెడియన్స్ పక్కన తప్ప హీరోల పక్కన నువ్వు సెట్ అవ్వవు అంటూ ఆయన అన్నాడు అప్పుడు జరిగిన అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. కానీ నా ప్రయత్నం ఎక్కడ ఆపలేదు ఎన్నో వేధింపులను కూడా ఎదుర్కొని పైకి వచ్చాను.. అందుకే నేడు ఈ స్థాయిలో ఉన్నాను” అంటూ ఐశ్వర్య రాజేష్ తెలిపింది. ఐశ్వర్య రాజేష్ కూడా లైంగిక వేధింపులతో ఇబ్బంది పడిందని తెలిసి ఆమె అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *