Corona Virus Preventive Measures - NTR, Ram Charan | COVID-19 - YouTubeపేరుకే బాబాయ్.. అబ్బాయ్.. అయినా ఇద్దరు చాలా మంచి స్నేహితులు లాగా ఉంటారని అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఎంత గుర్తింపు అయితే ఉందో అంతకంటే ఎక్కువ స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గుర్తింపు ఉందని చెప్పవచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల మధ్య సానిహిత్యం ఎంతలా ఉంది అంటే రామ్ చరణ్ కోసం పాకెట్ మనీ కింద చిరంజీవి డబ్బులు ఇస్తే.. ఆ డబ్బులను పవన్ కళ్యాణ్ తన పాకెట్ మనీ కోసం ఉపయోగించుకునేవారట.. అంతలా తమ బాండింగ్ ఉండేది అని పవన్ కళ్యాణ్ ఒకసారి వెల్లడించిన విషయం తెలిసింది.

ఇదిలా ఉండగా గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూపులకు బ్రేకులు వేస్తూ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.. అయితే ఈ షో కి హోస్టుగా జూనియర్ ఎన్టీఆర్ చేయగా.. మొదటి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు మాటల్లో మాటగా ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవడంతోపాటు ఎన్నో ఎమోషనల్ టాపిక్స్ తెరపైకి తీసుకొచ్చారు .ఇందులో భాగంగానే ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకొని రాగా తన బాబాయ్ గురించి చెబుతూ పూర్తిగా ఎమోషనల్ అయ్యారు రాంచరణ్..

” బాబాయ్ గురించి ఏదైనా చెప్పమని అందరూ అడుగుతూ ఉంటారు .. కానీ కొన్ని బంధాల గురించి చెప్తే దిష్టి తగులుతుంది.. మాది ఎవరికి చెప్పలేని రహస్య బంధం. అందుకే నేను బాబాయ్ గురించి పెద్దగా బయట చెప్పను. కానీ అడుగుతుంది నువ్వు కాబట్టి ఈరోజు చెబుతున్నాను.. అని పవన్ కళ్యాణ్ తో తనకున్న అనుబంధం గురించి ఓపెన్” అయ్యాడు. ” ఆయన పేరుకే బాబాయ్.. కానీ నన్ను నా సిస్టర్స్ ని ఒక నాన్నలానే పెంచారు. నాన్న షూటింగ్స్ తో బిజీగా ఉన్న రోజుల్లో మా అందరికీ పవన్ బాబాయ్ తోడుగా ఉంటూ వచ్చారు.. మా చదువుల దగ్గర నుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నీ కూడా బాబాయే చూసుకున్నారు. నాన్న నాకు నేరుగా చెప్పలేని ఎన్నో విషయాలను బాబాయ్ చేత చెప్పిస్తూ ఉంటారు. అందుకే ఆయన మాకు చిన్న నాన్నతో సమానం.

నేను ఈరోజు స్టార్ హీరోగా దేశం మెప్పు పొందిన స్థానంలో ఉండగలిగాను అంటే.. ఆయన ఇచ్చిన శిక్షణ వల్లే.. ఆయన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆయన లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఎక్కడ ఉండేవాడినో” అంటూ మరింతగా ఎమోషనల్ అయ్యారు రాంచరణ్. మొత్తానికి ఎన్టీఆర్ పై ప్రేమతో తమ బంధాన్ని రివీల్ చేశారు రామ్ చరణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *