ప్రభాస్ తండ్రి గురించి ఎవరికి తెలియని రహస్యాలు.. అప్పట్లో అచ్చం  ప్రభాస్‌లానే అయన కూడా

తెలుగు సినీ ప్రపంచంలోకి ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టి అతి కొద్ది రోజుల్లోనే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వర్షం, బిల్లా ,బాహుబలి లాంటి సినిమాలను చేశాడు. అంతేకాకుండా పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగిన ప్రభాస్ గురించీ మనందరికీ తెలిసిందే. ఇక ఆయన తీసిన బాహుబలి సినిమాతో ప్రపంచస్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా గురించి మోహన్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా గొప్ప విజయంతోనే ప్రభాస్ తండ్రి ఎక్కడ ఉన్నా చాలా సంతోషిస్తాడు. అని అన్నాడు . ఈ మాటలతో ఒక్కసారిగా ప్రభాస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

ప్రభాస్ వాళ్ళ నాన్న పేరు సూర్యనారాయణ రాజు. ఇతని జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించాడు. అంతేకాకుండా ఇతను కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం గమనార్హం.అతి కొద్ది కాలంలోనే చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. కృష్ణవేణి అనే సినిమాతో పాటు ఇంకా 10 సినిమాలకు నిర్మాత సారథ్యం వహించారు. ఇంకా చెప్పాలంటే తన కొడుకు నటించిన బిల్లా సినిమా కూడా ఈయన నిర్మించిందే. అయితే బిల్లా సినిమా అయిపోయిన తర్వాత ఆయన అనారోగ్యంతో కొంత అస్వస్థతకు గురయ్యాడు.

దిన దినానికి అనారోగ్యం క్షీణించటంతో ఆయనను హాస్పిటల్ కి తరలించారు. అలా కొంతకాలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ డిసెంబర్ 3 వ తేదీ 2010 లో ఆయన తుది శ్వాస విడిచాడు. ప్రభాస్ కి తన తండ్రి మరణం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇప్పుడైతే ప్రభాస్ తండ్రి ఉంటే తను చేసిన సినిమాలన్నీ చూసి ఎంతగానో మురిసిపోయేవాడు. ఇక ప్రభాస్ తండ్రి మరణించిన తర్వాత ప్రభాస్ బాధ్యతలను సినిమా బాధ్యతలను అన్నీ కూడా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కూడా మరణించడంతో ప్రభాస్ ఒంటరివాడయ్యాడని చెప్పవచ్చు.

కృష్ణంరాజు గారు ప్రభాస్ తో రెండు మూడు సినిమాల్లో నటించాడు. కృష్ణంరాజు మరణించిన తర్వాత వారి అంత్యక్రియలను చాలా ఘనంగా జరిపించాడు ప్రభాస్.. కృష్ణంరాజు కుటుంబం ఒంటరిగా మారింది. కాబట్టి వారి పెదనాన్న కుటుంబ బాధ్యత ప్రభాస్ మీదే పడింది. అలాగే ప్రభాస్ కు ముగ్గురు చెల్లెల్లు.. వారి బాధ్యత, వివాహం అలాంటివన్నీ ప్రభాస్ చూసుకోవాలి.. మరి ప్రభాస్ తన బాధ్యతలను ఎలా నెరవేరుస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *