రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు(AKKINENI NAGESHWAR RAO) అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు నందమూరి రామారావు అంటే ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు. ఇక అలాంటి అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా విక్రమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఇక ఈ సినిమా అంతగా హిట్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నారు. అయినప్పటికీ నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది శివ సినిమా మాత్రమే.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఈ సినిమా గురించి అంతగా తెలియదు.కానీ అప్పట్లో ఈ సినిమా చూసి చాలామంది నాగార్జున నటనకు ఫిదా అయ్యారు. అయితే ప్రస్తుతం ఈ జనరేషన్ వాళ్ళు ఆ సినిమా చూస్తే కనుక అసలు ఈ సినిమాకి రాంగోపాల్ వర్మ నే దర్శకత్వం వహించారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తారు. అయితే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ప్రవీణ్ రెడ్డి(PRAVEEN REDDY) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివ సినిమాకు సంబంధించి కొన్ని సంచలన నిజాలను బయటపెట్టారు.

ప్రవీణ్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివ,వజ్రం రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. మేము గుంటూరులో శివ (SHIVA)సినిమా హక్కులను కొనుగోలు చేశాం. ఇక శివ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన మొదటి షో నుండే హిట్ టాక్ ని తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ జేబులో పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరు ఆయనను అనుసరించారు. అంతేకాదు శివ సినిమా చూసి ఓ నిండు ప్రాణం కూడా బలి అయింది. అవును.. మీరు వింటున్నది నిజమే.శివ సినిమా వల్ల ఆత్మకూరులో ఒక మర్డర్ జరిగింది. అంతేకాదు ఈ సినిమా వల్ల ఎన్నో జరిగాయి.

ఇక ఈ సినిమా వల్ల అలాంటివి జరగడానికి ప్రధాన కారణం ఈ సినిమాను చూసి చాలా మంది జనాలు అలాగే నాగార్జునను ఫాలో అయ్యారు అంటే ఈ సినిమా జనాలలో ఎలాంటి ప్రభావం చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక నాగార్జున నటించిన గీతాంజలి(GEETHANJALI) సినిమా సైలెంట్ హిట్..అంటూ ప్రవీణ్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏంటి శివ సినిమా వల్ల ఓ నిండు ప్రాణం బలైందా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మధ్యనే నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా విడుదలై ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *