మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన‌ప్పటికీ త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగా ప‌వ‌ర్ స్టార్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు రామ్ చ‌ర‌ణ్(ram charan). తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో చ‌ర‌ణ్ క్రేజ్ డ‌బుల్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

ఇక త‌న‌యుడి ఎదుగుద‌ల నుంచి చిరంజీవి(chiranjeevi) ఉప్పొంగిపోయిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చ‌ర‌ణ్ ను ఎప్పుడూ ఎంతో ప్రేమ‌గా ట్రీట్ చేస్తారు. అయితే ఎంతో ప్రేమగా ఉండే చిరు ఒక సందర్భంలో రామ్‌ చరణ్‌ను బెల్ట్ తో చిత‌క‌బాదేశార‌ట‌. చ‌ర‌ణ్ 8 ఏళ్ల వ‌య‌సులోనే ఓ తుంట‌రి ప‌ని చేసి అడ్డంగా బుక్ అవ్వ‌డ‌మే అందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

రామ్ చరణ్ ఎనిమిదేళ్ల వయసులో తన ఇంటి వాచ్‌ మెన్‌, సెక్యూరిటీ వ్యక్తి మాట్లాడుకోవటం విన్నాడట. అయితే ఆ మాటలకు అర్ధం ఏంటో చ‌ర‌ణ్‌కు తెలియ‌లేద‌ట‌. దాంతో లోప‌ల‌కు వెళ్లి బాబాయ్‌ నాగబాబు(nagababu)ను ఆ మాట‌ల‌కు అర్థమేంటో అడిగాడట. అదే సమయంలో చిరంజీవి షూటింగ్‌ ముగించుకొని ఇంటికి రావటంతో.. నాగ‌బాబు చ‌ర‌ణ్‌ను చిరు రూమ్ లోకి తీసుకెళ్లి `వీడు అసభ్యకరమైన మాటలు నేర్చుకుని, దానికి అర్థం ఏంటి అంటూ న‌న్నే అడుగుతున్నాడు` అంటూ కంప్లైంట్ ఇచ్చాడ‌ట‌.

దాంతో చిరంజీవికి చాలా కోపం వ‌చ్చేసింద‌ట‌. ఆ కోపంలో చిరు త‌న‌కు త‌న తండ్రి గిఫ్ట్ గా ఇచ్చిన పోలీస్ బెల్ట్ తో చ‌రణ్ కు చిత‌క‌బాదేశార‌ట‌. అయితే కోపం త‌గ్గిన వెంట‌నే చ‌ర‌ణ్‌కు దగ్గరకు తీసుకొని అవి చెడ్డ మాటలని అలాంటివి ఎప్పుడు మాట్లాడ వద్దని ప్రేమ‌గా చెప్పార‌ట‌. ఈ సంఘటన తరువాత జీవితంలో ఇంకెప్పుడు చిరు చరణ్ మీద చేయి చేసుకోలేదట. ఈ విష‌యాన్ని గ‌తంలో చ‌ర‌ణ్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. `ఆర్సీ 15(RC15)` వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ మూవీ అనంత‌రం `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సానాతో చ‌ర‌ణ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *