యాదమ్మ రాజు.. ఈ కమెడియన్ పేరు ప్రతి ఒక్కరికి తెలుసు. పటాస్(pataas) షో లో ఒక మామూలు ప్రేక్షకుడిగా షో చూడడానికి వచ్చి తన టాలెంట్ తో,మాటలతో అక్కడివారిని మెస్మరైజ్ చేసి కొన్ని రోజుల్లోనే పటాస్ షోలో కమెడియన్ గా చోటు సంపాదించుకున్నాడు. ఇక ఆ షోలో తన కామెడీ టైమింగ్ చూసి చాలామంది జనాలు ఆయనకు అభిమానులు అయ్యారు. కేవలం పటాస్ లోనే కాకుండా జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోలలో కూడా చేసి మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు.

కేవలం బుల్లితెర మీదే కాకుండా వెండితెర మీద వచ్చే కొన్ని సినిమాల్లో కూడా కమెడియన్ గా చేస్తూ అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక ఈయన కామెడీ షో లో వేసే స్కిట్లు అన్ని గ్రామీణ వాతావరణం నేపథ్యంలో వచ్చి చూసే వాళ్లందర్నీ అట్రాక్ట్ చేస్తాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా యాదమ్మ రాజు(yadamma raju) తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి వాళ్ళ అంగీకారంతో ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఇక ఈయన ఎంగేజ్మెంట్ కి చాలామంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అలాగే యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే యాదమ్మ రాజు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి స్టెల్లాకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసే వీడియోలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే యాదమ్మ రాజు స్టెల్లా(stella)కి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజెన్స్ ఈయనకు కంగ్రాట్స్ చెప్తుంటే మరి కొంత మందేమో ఈ జంటపై తీవ్రంగా మండిపడుతున్నారు.

మరీ ముఖ్యంగా యాదమ్మ రాజును తిట్టిపోస్తున్నారు. దానికి కారణం యాదమ్మ రాజు చేసుకోబోయే అమ్మాయి క్రిస్టియన్. ఇక ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది హిందువులు నువ్వు ఒక హిందూ అయి ఉండి క్రిస్టియన్ అమ్మాయివి ఎలా పెళ్లి చేసుకుంటావు సిగ్గు లేదా అంటూ యాదమ్మ రాజు పై సోషల్ మీడియా వేదిక గా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయనపై వస్తున్న ట్రోల్స్ కి యాదమ్మ రాజు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *