పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు జనసేన(janasena) పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సరికొత్తగా చేస్తారు. అది సినిమాల్లోనైనా.. రాజకీయాల్లోనైనా..ఇక ఈ విషయం పక్కన పెడితే.. అప్పట్లో పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

చిరంజీవి(chiranjeevi)కి పరిటాల రవికి మధ్య భూమి గొడవలు వచ్చాయని అందులో పవన్ కళ్యాణ్ తల దూర్చాడని,ఇక ఆ కోపంతో పరిటాల రవి పవన్ కళ్యాణ్ ని కిడ్నాప్ చేసి గుండు కొట్టించారంటూ ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో ఎవరికి తెలియదు కానీ చాలా వార్తలు పుంకాను పుంకాలుగా వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో మాత్రమే కాదు వైసీపీ పార్టీలో మంత్రిగా ఉన్న రోజా కూడా అప్పట్లో పబ్లిక్ గానే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకున్నారు అనే టాపిక్ తీసుకు వచ్చింది.

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో తప్ప మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ గుండు ప్రస్తావన ఎక్కడా వినిపించలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారు అని వస్తున్న వార్తలపై పరిటాల రవి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పరిటాల రవి(paritala ravi) మాట్లాడుతూ.. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం ఉందో మనందరికీ తెలుసు. అలాంటి నవ యువ నాయకుడి పైన ఇలాంటి రూమర్లు రావడం ఏం బాగాలేదు. అయితే ఒక నాయకుడు అన్నాక అతనిపై ఎన్నో తప్పుడు వార్తలు వైరల్ అవుతాయి.

కానీ ఎలాంటి ఆధారాలు నిజాలు లేకుండా ఇలా ఏది పడితే అది మాట్లాడుకోవడం మంచి పని కాదు. అయితే పవన్ కళ్యాణ్(pawan kalyan) ఎదుగుదలను చూసి కావాలనే కొంతమంది ఆయనపై చెడు ప్రచారం చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి నాకు మంచి సత్సంబంధం ఉంది. ఇలా మా ఇద్దరి మీద వచ్చే అబద్ధపు ప్రచారాలను ఆయన ఎప్పటికీ నమ్మరు. అసలు గుండు కొట్టించారు అని వచ్చే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.. అంటూ ఓ ఇంటర్వ్యూలో పరిటాల రవి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పటికైనా ఈ వివాదం ముగుస్తుంది అంటూ చాలామంది భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *