అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel).. ఈ ఫారెన్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళ చిత్రంతో హీరోయిన్ గా సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అందాల సోయగం.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `మజ్ను` మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ క‌ట్టాయి.

కానీ సక్సెస్ మాత్రం వరించలేదు. తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ సైతం ఈ అమ్మడుకి కలిసి రాలేదు. ఇక అను ఇమ్మాన్యుయేల్ త‌న కెరీర్ లో ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన చిత్రం `అజ్ఞాతవాసి(Agnyaathavaasi)`. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ మరో హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Trivikram Srinivas) ను అను ఇమ్మాన్యుయేల్ ఎంతగానో నమ్మిందట. అందుకు కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ తన కెరీర్ లో చాలామంది హీరోయిన్లకు బ్లాక్ బస్టర్ హిట్లను అందించి వారి రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ లిస్టులో ఇలియానా, పూజ హెగ్డే, సమంత వంటి వారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే `అజ్ఞాతవాసి` సినిమాతో తన దశ కూడా తిరుగుతుందని అను ఇమ్మాన్యుయేల్ భావించింది. కానీ త్రివిక్రమ్ ను నమ్ముకున్న ఈ భామ‌ చివరకు దారుణంగా మోసపోయింది. 2018 జనవరి 10న భారీ అంచనాల న‌డుమ‌ విడుదలైన `అజ్ఞాతవాసి` బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాతో స్టార్ హోదా దక్కుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్ పై అనూహ్యంగా ఐరన్ లెగ్‌ అనే ముద్ర‌ పడింది. ఈ ముద్రను చెరుపుకోవడం కోసం అను అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇక ఎన్నో ఎదురు చూపుల అనంతరం అను ఇమ్మాన్యుయేల్ కు ఇటీవల విడుదలైన `ఊర్వశివో రాక్షసివో(urvasivo rakshasivo)` సినిమాతో హిట్ పడింది. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో అను ఇమాన్యుల్ పాత్రకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు ద‌క్కాయి. ఇక ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ మాస్ మ‌హార‌జ్ ర‌వితేజ‌కు జోడీగా `రావ‌ణాసుర‌` సినిమాలో న‌టిస్తోంది. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె ప్రారంభం అయింది. ఈ మూవీతో పాటు అను చేతిలో మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఉన్నాయ‌ని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *