కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్(eshwar) సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇక ఈయన నటించిన చత్రపతి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో తీస్తే కనుక కలెక్షన్ల వర్షం కురిసేది. ఇక పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 1,బాహుబలి 2 సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమాతో ప్రభాస్ తన నటనను ప్రపంచమంతా తెలియజేశాడు. బాహుబలి(bahubali) తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక ఈయన నటించిన పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మరొక సినిమా కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్..

ఇక ఈ సినిమా కోసం మాత్రం ఈయన అభిమానులు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆది పురుష్ (aadi purush)సినిమాని పోస్ట్ పోన్ చేసి ముందు సలార్ సినిమా విడుదల చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు సలార్ సినిమా ఎలా ఉంటుందో ముందుగానే రివ్యూ చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. నేను సలార్ మూవీకి సంబంధించి 30 సెకండ్ లో ఉన్న వీడియో చూశాను. ఇక ఈ సినిమా మాత్రం మీరు అనుకున్న అంచనాలకు మించి సక్సెస్ అవుతుంది అని నాకు అనిపిస్తోంది.

అంతేకాదు వచ్చే ఏడాది ఖచ్చితంగా ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడు పక్కా అంటూ సలార్ సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేశారు ఉమైర్ సందు. ఇక ఈ విషయం వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆ రోజున రిలీజ్ కాలేదు. ఇక రోజు రోజుకి సలార్(salaar) సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *