Surya Prabhas | Suriya Prabhas | Suriya Masss | Suriya Rakshasudu | Prabhas | Suriya | Prabhas Baahubali | Baahubali Audio Release | - Filmibeat

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిజానికి ఆయన పేరులోనే కాదు మనసులో కూడా రారాజు అనే చెప్పాలి. ఆరడుగుల కటౌట్ ఉన్నా.. చాలా సౌమ్యంగా ఉంటాడు. సినిమా షూటింగ్స్ తప్పించి మిగతా టైం లో ఎక్కడా కూడా బయట కనిపించడు.. ఫాన్స్ అంటే ఎంత అభిమానమో.. తోటి నటీనటులంటే అంతే గౌరవం.. అతడి పేరు ప్రభాస్ అయినప్పటికీ అభిమానులు మాత్రం డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. బాహుబలి సినిమా వరకు నార్మల్ హీరోగా ఉన్న ఈయన బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ ను అమాంతం పెంచేసుకున్నారు. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ హీరో అయిపోయిన ప్రభాస్ ఒక కోలీవుడ్ హీరో కోసం రాత్రంతా ఎదురు చూశారట. ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అని.. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అని తెలియజేశాడు. అలాగే తన తోటి నటీనటులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అసలు తగ్గడు. ప్రభాస్ తో పాటు పనిచేసిన హీరోయిన్లు, నటీనటులు చాలా మంది ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఇన్ స్టా లో ఫోటోలు పెట్టి మరి షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఒక సమయంలో కోలీవుడ్ హీరో సూర్య కోసం రాత్రంతా వేచి చూశారట ప్రభాస్. అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ మొత్తం విషయాన్ని వెల్లడించారు.

“నేను.. ప్రభాస్ హైదరాబాదులోనే సేమ్ లొకేషన్ లో షూటింగ్ చేశాము. కలిసినప్పుడు రాత్రి కలసి భోజనం చేద్దామని ప్రభాస్ నాతో అన్నాడు . నా కోసం వెయిట్ చేస్తాను అని చెప్పాడు. అయితే సాయంత్రం 6:00 లోపు అయిపోయిందనుకున్నాను.. కానీ నా షూటింగ్ అయ్యేసరికి కాస్త రాత్రి 11:30 అయిపోయింది. దీంతో ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకని.. ఏదైనా హోటల్ లేదా ప్రొడక్షన్ మెస్ లో తినేద్దాం అనుకున్నాను. తర్వాత రోజు ప్రభాస్ ని కలిసి సారీ కూడా చెబుదామనుకున్నాను..

అయితే నేను షూటింగ్ ముగించుకుని కారిడారిలో నడుస్తుండగా ప్రభాస్ పిలిచాడు.. సర్ నేను రెడీ.. మీరు స్నానం చేసి వస్తే భోజనం చేద్దామని ..అన్నాడు.. నేను ఆశ్చర్యపోయాను.. రాత్రి చాలా లేట్ అయిపోయింది కదా! ఏం వెయిట్ చేస్తారు అనుకున్నా.. కానీ తన ఇంటి నుంచి ప్రభాస్ బిర్యాని తెప్పించాడు. ప్రభాస్ వాళ్ళ అమ్మ చేసిన బిర్యాని చాలా బాగుంది” అని.. అప్పట్లో జరిగిన విషయాన్ని బయట పెట్టారు. ఏది ఏమైనా ప్రభాస్ అంకితభావానికి ఫిదా అయిపోయారు సూర్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *