విజయ్ దళపతి హీరో గా నటించిన వారిసు సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా కు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

సంక్రాంతి కి విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి అప్డేట్ లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో రంజితమే అనే పాటను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది సినిమా. ఈ నేపథ్యంలో ఈ పాటకు యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

లక్ష ల కొద్ది వ్యూస్ రావడంతో ఈ పాట తెలుగు వెర్షన్ కోసం అందరు ఎదురుచూశారు. తాజాగా తెలుగు వెర్షన్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు అనురాగ్ కులకర్ణి, మనసి గళాన్ని అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

మరి సంక్రాంతి విడుదల పట్ల కొంత వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమావిడుదల అవుతుందా అనేది చూడాలి. దీనిపట్ల నిర్మాత దిల్ రాజు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *