యాంకర్ సుమ(suma).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సీరియల్స్ ద్వారా ఆమె ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది.. ఇక ఏ ఈవెంట్ అయినా, ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా,ట్రైలర్ రిలీజ్ అయిన, ఏదైనా ఇంటర్వ్యూ అయినా ఇలా ప్రతి ఒక్క విషయంలో కచ్చితంగా యాంకర్ సుమ ఉండాల్సిందే.

అంతేకాదు చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఖచ్చితంగా మా ఈవెంట్ కి యాంకర్ సుమా రావాల్సిందే అంటూ పట్టుబట్టి మరీ ఆమెను తీసుకువస్తారు. సుమ తన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఏదైనా ఈవెంట్లో సుమా ఉందంటే చాలు కచ్చితంగా అందులో సందడి కనిపిస్తుంది. యాంకర్ సుమ కేవలం యాంకర్ గానే కాకుండా ఈమధ్య జయమ్మ పంచాయతీ(jayamma panchayathi) అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. అలాగే బుల్లితెర మీద ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే క్యాష్ ప్రోగ్రామ్లో కూడా యాంకర్ గా చేస్తుంది.

ఇక సుమ చేసే ఈ ప్రోగ్రాం ఎన్నో ఏళ్ల నుంచి టాప్ రేటింగ్ వస్తుంది.ఇక ఈ క్యాష్ ప్రోగ్రాం లో ప్రతివారం నలుగురు స్పెషల్ గెస్ట్ లు వస్తారు. ఇక వారిని సుమా తన మాటలతో ఫన్నీ టాస్కులు ఇచ్చి అందరిని అలరిస్తూ చూసే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వారం క్యాష్ ప్రోగ్రాం కి హేమ, ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, హరితేజ(hariteja) గెస్ట్లుగా వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్లో చివర్లో ఒక ఫన్నీ టాస్క్ వచ్చింది.

అలాగే గెస్ట్ గా వచ్చిన ప్రవీణ్ సుమకి లవ్ ప్రపోజ్ చేయమని ఒక కాలేజ్ కుర్రాడికి చెప్పాడు. దాంతో ఆ కాలేజీ కుర్రాడు చేతిలో ఫ్లవర్ పట్టుకొని సుమ దగ్గరికి వెళ్లి నిన్ను ఎప్పటినుండో నేను ఫాలో అవుతున్నాను. ఐ లవ్ యు సుమ అంటూ ఒక లవర్ ఎలా ఫీలవుతాడో అలా ఫీల్ అయ్యి చెప్పాడు.ఇక ఆ కాలేజ్ కుర్రాడు చెప్పినదానికి గట్టి కౌంటర్ ఇచ్చింది సుమ.. ఇంతకీ సుమ ఏమందంటే.. నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ వి కదా అంటూ అనడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *