CM Jagan at Comedian Ali's daughter wedding reception

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆయన తన కూతురు ఫాతిమా వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆదివారం జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎంతో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి , నాగార్జున , బ్రహ్మానందం, అమల, రోజా, సురేఖ తదితరులు వివాహానికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా చాలా వైరల్ గా మారాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడే ఫాతిమా డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాక్టర్ నే భార్యగా పొందుతున్న షెహ్యాజ్ బ్యాగ్రౌండ్ గురించి ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రీసెంట్ గానే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసింది. అంతేకాదు ఆలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ కూడా ఈమె కావడం గమనార్హం. ఆలీ అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టరే కావడం విశేషం . జమీలా బాబీ, జలాని భాయ్ దంపతుల కుమారుడే ఇతడు.. ఈయనకు ఒక అన్నయ్య , సోదరి కూడా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరితోపాటు షెహ్యాజ్ అన్నయ్య భార్య వదిన కూడా డాక్టరే కావడం గమనార్హం. అయితే వీరంతా గుంటూరుకు చెందిన వారి అయినప్పటికీ లండన్ లో సెటిల్ అయ్యారు.

ముఖ్యంగా షెహ్యాజ్ కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత కుటుంబం.. ఇంట్లో అందరూ డాక్టర్లే కావడంతో ఈయన కూడా ఎంతో కష్టపడి డాక్టర్ చదివినట్లు తెలుస్తోంది.. ఆలీ కూడా కూతురు డాక్టర్ చదివేసరికి అల్లుడిని కూడా డాక్టరే కావాలని ఆలోచించి ఏరి కోరి వెతికి మరి షెహ్యాజ్ ను అల్లుడిగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కూతురు డాక్టర్ కాబట్టి అల్లుడు కూడా డాక్టర్ అయితే బాగుంటుందని ఆలోచించి మరి వివాహం జరిపించారు ఆలీ.

మొత్తానికి ఆలీ అనుకున్నట్టుగానే తన కూతురును మరొక డాక్టర్ కి ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా అన్ని అప్డేట్స్ కూడా ఆలీ భార్య జుబేదా ఎప్పటికప్పుడు యూట్యూబ్ వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తూనే వచ్చింది. ప్రతి ఒక్కరూ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *