ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్(rajinikanth) అలాగే టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు భరించి వాళ్లకు జరిగిన అవమానాలను ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు. వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ కేవలం తమ నటనతోనే అందర్నీ మెప్పించి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరో లుగా మారిపోయారు.

ఇక వీరు అతి తక్కువ కాలంలోనే తమ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు,ప్రొడ్యూసర్ అయిన జీవి నారాయణరావు(G.V.Narayanarao) ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి, రజినీకాంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.. ఆయన మాట్లాడుతూ ఓ సినిమాలో భారతి రాజా సుధాకర్ కి చేయడానికి ఓ పాత్ర ఇచ్చారు. కానీ చిరంజీవికి మాత్రం ఆ సినిమా లో ఛాన్స్ ఇవ్వలేదు. ఆ టైంలో చిరంజీవి చాలా బాధపడ్డారు.

అలాగే రజనీకాంత్ నేను అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాము. కొన్ని సినిమాలు చేసే టైంలో నాకు ఛాన్స్ లు ఇచ్చి రజినీకాంత్ కి అవకాశాలు ఇవ్వని సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. నాకు ఎక్కువగా హాఫ్ బీట్ సినిమాలు అంటేనే ఇష్టం. నేను ఎక్కువగా ఆర్ట్ సినిమాల్లోనే నటించాను. అలాగే నేను నిర్మించిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రజనీకాంత్, చిరంజీవి(chiranjeevi)లు ఎన్నో అవమానాలు భరించారు.

అయితే వాళ్లు అన్ని అవమానాలు భరించారు కాబట్టే ప్రస్తుతం ఈ రేంజ్ లో ఉన్నారు. అసలు రజనీకాంత్ ఇండస్ట్రీకి హీరో అవ్వదామని రాలేదు. ఆయన ఇండస్ట్రీలో విలన్ అవుదామని వచ్చారు. కానీ ఆయన హీరోగా ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యారు అంటూ ఓ ఇంటర్వ్యూలో జీవి నారాయణరావు చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు రజనీకాంత్ విలన్ అవుదాం అనుకున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *