ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఎంతమంది తాము ప్రేమించిన అమ్మాయిలను,అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ మధ్యనే టాలీవుడ్ లో యంగ్ హీరో నాగ శౌర్య(nagashourya)పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యారు. అలాగే హన్సిక కూడా మరో నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతోంది. ఇక ఇలా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రెటీలు అందరూ పెళ్లి చేసుకుంటూ జీవితంలో సెటిల్ అవుతున్నారు. కేవలం వెండితెర సెలబ్రిటీలే కాకుండా బుల్లితెర సెలబ్రిటీలు కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

తాజాగా యాదమ్మ రాజు తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రముఖ ఛానల్లో వచ్చే పటాస్ షో ద్వారా ఫేమస్ అయ్యాడు యాదమ్మ రాజు. ఇక ఆ షో లో ఈయన చేసే పర్ఫామెన్స్ కి చాలా మంది ఫిదా అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్(jabardasth), అదిరింది వంటి కామెడీ షో లలో కూడా ఈయన చేశారు. ఇక యాదమ్మ రాజు పటాస్ షో లో ఒక కామన్ ప్రేక్షకుడిలా వచ్చి తన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక తన టాలెంట్ ని మెచ్చి పటాస్ షో ఈయనకు ఒక అవకాశం ఇచ్చింది.

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైం లోనే మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అయితే యాదమ్మ రాజు తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్ళ అంగీకారంతో ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక యాదమ్మ రాజు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు స్టెల్లా(stella). వీళ్ళిద్దరూ ఎన్నో రోజులుగా లవ్ చేసుకుని ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ మధ్యనే ఈయన ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. యాదమ్మ రాజు(yadamma raju)కి ఇదంతా బాగానే అనిపించినా కేవలం ఒకే ఒక లోటు కనిపించిందట. అదేంటంటే.. పెళ్లి అయ్యాక బ్యాచిలర్ లైఫ్ కి పులిస్టాప్ పెట్టాలి కదా అని యాదమ్మ రాజు అలాగే ఆయన స్నేహితులందరూ బాధపడుతున్నారట. అంతేకాదు ఈ విషయంలో ఈయన స్నేహితులు చాలామంది యాదమ్మ రాజు పై సెటైర్లు వేస్తూ నీకు పెళ్లి అయ్యాక నీకు అసలు లైఫ్ కనబడుతుంది అంటూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారట. ప్రస్తుతం యాదమ్మ రాజు తన బ్యాచిలర్ లైఫ్ కోల్పోతున్నాను అంటూ బాధపడుతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *