ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉండడం అటు కుటుంబ సభ్యులనే కాదు ఇటు సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించడం ఆయన లేరనే విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. రీసెంట్గా జరిగిన కృష్ణ పెద్దకర్మ కార్యక్రమంలో మహేష్ బాబు ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. అయితే కృష్ణ కుటుంబంలో మహేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి.. అలాంటి వారిలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కుటుంబ సభ్యుల గురించి చాలామందికి తెలియదని చెప్పవచ్చు.

తాజాగా రమేష్ బాబు కూతురితో కలిసి దిగిన ఒక ఫోటోను నమ్రత పోస్ట్ చేస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. తాజాగా నమ్రత… రమేష్ బాబు కూతురు భారతి , తన కూతురు సితారతో కలిసి తీసుకున్న ఒక ఫోటోను ఇన్ స్టా లో పోస్ట్ చేసింది . “ఈ ఇద్దరు అమ్మాయిలు వల్లే ఇంట్లో మళ్లీ నవ్వులొచ్చాయి” అని క్యాప్షన్ రాసుకొచ్చింది. బావ రమేష్ బాబు కూతురి ఫోటో నమ్రత షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతే కాదు ఆ అమ్మాయిలు ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారని సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే రమేష్ బాబు మరణించిన తర్వాత ఆయన పిల్లలు జయకృష్ణ, భారతి ఒంటరి వారు అయ్యారని చెప్పవచ్చు. అయితే వీరి తల్లి వీరి భవిష్యత్తుపై ఆరాటపడుతున్న నేపథ్యంలో వీరి కుటుంబానికి మహేష్ బాబు అండగా నిలుస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రమేష్ బాబు కొడుకు చాలా అందంగా ఉన్నాడు. జయకృష్ణ తాత కోరిక మేరకు యూఎస్ఏ లో నటనలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తాత చిన్న కర్మ కార్యక్రమానికి జయ కృష్ణ హజరవుగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

జయ కృష్ణ మంచి హీరో కటౌట్ తో మొదటి చూపుతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే త్వరలోనే జయకృష్ణను హీరోగా మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. ఒక మంచి కథ , టాలెంటెడ్ డైరెక్టర్ తో జయకృష్ణ ను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *