హీరోయిన్ మీనా(meena) అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లో స్టార్ హీరోలు సైతం మా సినిమాల్లో మీనా కచ్చితంగా హీరోయిన్ గా చేయాలి అని పట్టుబట్టి కూర్చునేవారు. అంతేకాదు ఒకవేళ మీనా డేట్స్ ఖాళీగా లేకపోతే ఆ సినిమా షూటింగ్ కూడా వాయిదా వేసేవారంటే అప్పట్లో మీనా క్రేజ్ ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె ఎన్నో సినిమాల్లో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలోనే విద్యాసాగర్(vidyasagar) ని పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు పాప పుట్టాక మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ,అత్త పాత్రల్లో నటిస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా హీరోయిన్ మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.

తన తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల అలాగే తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండో పెళ్లికి రెడీ అయింది అంటూ ఇలా మీనా పై చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పడి చివరికి మీనా చెవిలో పడింది. ఇక ఈ విషయం తెలియగానే మీనా ఆ రూమర్ ని వైరల్ చేసిన వారిపై చాలా మండిపడింది. అంతేకాదు డబ్బు కోసం ఎలాంటి నీచమైన వార్తలైనా రాస్తారా.నేను రెండో పెళ్లి చేసుకుంటానని మీలో ఎవరికైనా చెప్పానా..సిగ్గు లేదా మీకు..

డబ్బుల కోసం ఇంత దిగజారిపోతారా.. నిజమేంటో అబద్ధం ఏంటో తెలియకుండా ఏది పడితే అది రాసేస్తారా.. నా భర్త చనిపోయినప్పుడే నా గురించి ఎన్నో వార్తలు మీడియాలో వచ్చాయి.కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే నామీద ఇంకెన్ని వార్తలు వస్తాయో. ఈ వార్తలు ఇక్కడితో ఆగకపోతే బాగుండదు..అంటూ మీనా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ప్రస్తుతం మీనా స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆమెపై వచ్చే వార్తలకు పులిస్టాప్ పడేట్లు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *