Kriti Sanon on dating rumours with Prabhas; calls them baseless | Hindi Movie News - Times of Indiaటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ పెళ్లి వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇందుకు కారణం వరుణ్ ధావన్ అని చెప్పాలి. కృతి సనన్, వరుణ్ ధావన్ కలిసి నటించిన తోడేలు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా కరణ్ జోహార్ కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ తెగ సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగానే కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు .. దీపికా పదుకొనేతో షూటింగ్లో ఉన్నాడు అంటూ వరుణ్ ధావన్ బాంబు పేల్చాడు ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమాలో దీపికా పదుకొనే తో నటిస్తున్న విషయం తెలిసిందే.

అందుకే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. నిజానికి ఆది పురుష్ సినిమాలో కృతి సనన్ జానకిగా, ప్రభాస్ రాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరి మధ్య సాగిన కొన్ని సన్నివేశాలు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలకు బలం చేకూరేలా చేశాయి. రోజురోజుకు వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడంతో కృతి సనన్ క్లారిటీ ఇచ్చింది. కృతి సనన్ ప్రభాస్ తో డేటింగ్ లో ఉన్నారని , త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు అన్న వార్తలపై అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించింది కృతి సనన్

ఆమె తన ఇన్ స్టా ఖాతా ద్వారా” అటువంటిదేమీ లేదు.. బేస్లెస్ రూమర్స్ ను నమ్మవద్దు. పెళ్లి నిశ్చయం అయిందని వస్తున్న వార్తలు కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. తోడేలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇటువంటివి ప్రచారం చేయవద్దు” అంటూ కృతి సనన్ తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా షేర్ చేసింది ప్రస్తుతం కృతి సనం షేర్ చేసిన ఈ పోస్ట్ బాగా వైరల్ గా మారుతోంది.

మరొకవైపు ప్రభాస్ పై ఇప్పటికే వర్షం సినిమా సమయంలో త్రిషతో ఆ తర్వాత, కాజల్, ఆ తర్వాత అనుష్కతో ప్రేమ పెళ్లి వార్తలు వినిపించిన విషయం తెలిసిందే . వీటన్నింటిపై స్పందించని ప్రభాస్ దీనిపై కూడా స్పందించలేదు.. ఎట్టకేలకు కృతి సనన్ స్పందించి వార్తలకు పులిస్టాప్ పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *