అలనాటి అందాల తార, దేవంగత నటి శ్రీదేవి(sridevi) పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తండ్రి బోనీ కపూర్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. కానీ జాన్వీ కపూర్ హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల ఈమె నటించిన `మిలీ` చిత్రం సైతం భారీ అంచనాల నడుమ విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.

ప్రస్తుతం జాన్వీ క‌పూర్(janhvi kapoor) సౌత్ పైనే ఉన్నాయి. సౌత్ లోకి అడుగు పెట్టాలని ఈ బ్యూటీ తెగ ఆరాటపడుతుంది. ముఖ్యంగా పెద్ద హీరో మూవీ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను పొందడం కోసం తహతహ‌లాడుతుంది. ఇందులో భాగంగానే అవకాశం వచ్చినప్పుడల్లా టాలీవుడ్ ను, తెలుగు సినిమాలను ఆకాశానికి ఎత్తేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో జాన్వీ కపూర్ `ఎన్టీఆర్ 30` సినిమాతో ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. దాదాపు ఆమెనే హీరోయిన్ గా ఫైన‌ల్ అయిందంటూ వార్తలు వ‌చ్చాయి.

కానీ ఆ వార్త‌లు నిజం కాదని.. ఒకవేళ నిజమైతే బాగుండని జాన్వీ కపూర్ ఓపెన్ గానే చెప్పింది. ఎన్టీఆర్(NTR) తో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఉందంటూ కూడా పేర్కొంది. అయితే కొరటాల శివ మాత్రం జాన్వీ వైపు చూడలేదు. అయినా సరే జాన్వీ కపూర్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. టాలీవుడ్ లో అడుగు పెట్టడం కోసం త‌న‌వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక‌ ఎట్టకేలకు సాధించింది. తాజాగా ఈ బ్యూటీని టాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వరించిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 16 వ చిత్రాన్ని `ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు సానాతో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ ను సంప్రదించ‌గా.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ తాజాగా ఓ టాక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంద‌ని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో జాన్వీ కపూర్ సాధించింది.. ఇక‌ టాలీవుడ్లో ర‌చ్చ‌ రచ్చే అంటూ నెటిజ‌న్లు మరియు ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి నిజంగా జాన్వీ రామ్ చ‌ర‌ణ్(ram charan) సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని అందుకుందా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *