ఛార్మి.. ఈ హీరోయిన్ పేరు కి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. నీ తోడు కావాలి(ni thodu kavali) అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఈమె నటించిన కొన్ని సినిమాలు హిట్లు మరికొన్ని సినిమాలు ప్లాఫులు అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఆమె వరసగా సినిమాలు చేస్తూ పోయేది. ఈమె ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

అలాగే నాగార్జున హీరోగా వచ్చిన మాస్ (mass)సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ గా చేసింది. హీరోయిన్ గానే కాకుండా చార్మి లేడీ ఓరియంటెడ్ సినిమాలు అలాగే ఐటెం సాంగ్ లలో కూడా చేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే చార్మిని అలా ఐటెం సాంగ్స్ లో బాగుంటుంది అని ఆమెను ఐటమ్ గర్ల్ గా మార్చింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఛార్మి అంద చందాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. అందుకే ఆమె హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ లోనే బాగుంటుంది అని మూవీ మేకర్స్ ఆలోచించి ఎక్కువగా ఆమెను స్పెషల్ సాంగ్స్ లలో తీసుకున్నారట.

అందుకే చార్మి చాలా సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి కుర్రాలను ఓ ఊపు ఊపింది. ఈమె దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని ప్రయోగాత్మక పాత్రల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతిలక్ష్మి(jyothi lakshmi) సినిమాలో ఈమె పోషించిన పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేశారు. ఇక కొన్ని రోజులకు ఛార్మికి నటన మీద ఇంట్రెస్ట్ తగ్గడంతో మేకప్ వేసుకోవడం వదిలేసి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా కొన్ని సినిమాలను నిర్మించింది.

కానీ ఈమె నిర్మించిన సినిమాలు ఎక్కువగా ప్లాఫ్ అయ్యాయి. ఇలా హీరోయిన్ గా ఉన్న ఛార్మి(charmi)ని మూవీ మేకర్స్ ఐటెం గర్ల్ గా మార్చేసి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టారా అంటూ చార్మి అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా హీరోయిన్ ని ఐటెం గర్ల్ గా మార్చారు ఇప్పుడు కనీసం ఐటెం సాంగ్స్ లో కూడా నటించడం లేదు అంటూ బాధపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *