షీనా షహబాది(sheena shahabadi).. అంతే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. కానీ, `బిందాస్‌` హీరోయిన్ అంటే ట‌క్కున గుర్తుకు వ‌స్తుంది. మంచు మ‌నోజ్ కెరీర్ లో మంచి విజ‌యం సాధించిన అతి కొద్ది చిత్రాల్లో `బిందాస్‌` ఒక‌టి. వీరు పోట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌నోజ్ కు జోడీగా షీనా ష‌హ‌బాది న‌టించింది. ఎ. కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం 2010 ఫిబ్రవరి 5 న విడుదలై మంచి విజ‌యం సాధించింది.

ఈ చిత్రంలో మంచు మ‌నోజ్‌(manchu manoj), షీనా ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ అద్భుతంగా పండింది. తెలుగులో ఇదే షీనాకు తొలి చిత్రం. అయితే మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌నెక్ట్ అయిన షీనా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అంద‌రూ భావించ‌రు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. తెలుగులో ఈ అమ్మ‌డు తొలిసారిగా, నందీశ్వరుడు, యాక్షన్ 3D, నువ్వే నా బంగారం, గడ్డం గ్యాంగ్ వంటి చిత్రాల్లో న‌టించింది.

అయితే ఈ చిత్రాలేవి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయాయి. షీనా క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ, ఎక్క‌డా ఈ బ్యూటీని స‌క్సెస్ వ‌రించ‌లేదు. ఆఫ‌ర్ల కూడా త‌గ్గిపోయాయి. దాంతో షీనా బాలీవుడ్(bollywood) లో ప‌లు సీర‌య‌ల్స్ లో న‌టించింది. అవి సైతం ఆమెకు పెద్ద‌గా గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.

ఇక ప్ర‌స్తుతం న‌ట‌న‌కు దూరంగా ఉంటున్న షీనా.. సోష‌ల్ మీడియా మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అదిరిపోయే ఫోటోషూట్లు, వీడియోల‌తో అల‌రిస్తుంది. సాధార‌ణంగా హీరోయిన్లు న‌ట‌న‌కు పులిస్టాప్ పెడితే గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోతుంటారు. కానీ, షీనా(sheena) అందుకు భిన్నం. ఆమె త‌న అందాన్ని, ఫిట్ నెస్‌ను ఏ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా కాపాడుకుంటూ వ‌స్తోంది. ఇంకా చెప్పాలంటే మునుప‌టి కంటే ఇప్పుడే ఇంకా అందంగా మ‌రియు హాట్ గా త‌యారైంది. అందుకు నిద‌ర్శ‌నం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలే. ఇక‌పోతే ఈ బ్యూటీ వైభవ్ గోర్‌ను వివాహం చేసుకుంది. అత‌డు ఒక వ్యాపార‌వేత్త‌.

https://www.instagram.com/p/CfYH-uGpwwP/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CbckamSKVD_/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *